Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఊహించని షాక్

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. పీటీ వారెంట్ పై ఆయనను విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

New Update
Chandrababu: ఎమ్మెల్సీ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం.!

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు (Chandrababu Naidu) షాక్ తగిలింది. పీటీ వారెంట్ పై ఆయనను విచారించేందుకు ఏసీబీ కోర్టు (ACB Court) అనుమతిచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటలలోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశించారు. ఇదిలా ఉంటే చంద్రబాబదు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ఏసీబీ కోర్టు. ఈ పిటిషన్ ను రేపటికి వాయిదా వేయాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరగా అందుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఒప్పుకోలేదు. దీంతో ఏసీబీ కోర్టులో ఆ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రేపు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ ఈ నెల 19వ తేదీ వరకు ఉంది.
ఇది కూడా చదవండి: CM Jagan: పవన్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు ఏపీలో ఇల్లే లేదు: సీఎం జగన్ విమర్శల వర్షం

ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ హైకోర్టులో పటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించిన కోర్టు కేసును క్లోజ్ చేస్తున్నామంటూ తీర్పు ఇచ్చింది. ఇంతకు ముందు హైకోర్టు జరిపిన విచారణలో గురువారం వరకు లోకేష్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కోర్టులో ఇరుపక్షాలు తమ వాదనలను వినిపించాయి.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది. ముద్దాయిగా చూపని కారణంగా అతనిని అరెస్ట్ చేయమని చెప్పింది. ఒకవేళ కేసులో లోకేష్ పేరు చేర్చినా 41ఏ నిబంధనలు అనుసరిస్తామని చెప్పారు సీఐడీ తరుఫు లాయర్లు. అనంతరం ఉన్నత న్యాయస్థానం కేసును డిస్పోజ్ చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. దీంతో నారా లోకేష్ కు రిలీఫ్ దొరికినట్లు అయింది.

Advertisment
తాజా కథనాలు