ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్.. జనసేనలోకి ఆమంచి స్వాములు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు చకచక జరిగపోతున్నాయి. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.

New Update
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్.. జనసేనలోకి ఆమంచి స్వాములు

publive-image

పవన్ సమక్షంలో పార్టీ కండువా..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీల్లోకి చేరికలు ఊపందుకున్నాయి. ఏ పార్టీలో అయితే తమకు మంచి భవిష్యత్ ఉంటుందో అంచనాలు వేసుకుని మరీ చేరిపోతున్నారు. తాజాగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరడం ఖాయమైపోయింది. శనివారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాములు అధినేత పవన్ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

భారీ బల ప్రదర్శనతో మంగళగిరికి..

పార్టీలో చేరిక సందర్భంగా స్వాములు తన బలం ప్రదర్శించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, దర్శి, గిద్దలూరు ప్రాంతాల నుంచి అనుచరులతో భారీ కాన్వాయ్‌తో మంగళగిరి వెళ్లనున్నారు. ఈ ప్రాంతాల్లో కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. దీంతో తనకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అధినేత పవన్ కల్యాణ్‌ను ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గిద్దలూరులో కాపు నేతలతో సమావేశమైన స్వాములు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టంచేశారు. ఎందుకంటే ఇక్కడ కాపు ఓట్లు భారీగా ఉండటంతో గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన అన్నా రాంబాబు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కాపు ఓట్లతో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఇకపై వేరువేరుగా ఆమంచి సోదరులు..

చీరాల నియోజకవర్గం నుంచి స్వాములు సోదరుడు ఆమంచి కృష్ణ మోహన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా.. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసీ మరీ గెలించారు. ఆయన గెలుపులో స్వాములు కీలక పాత్ర పోషించారుని స్థానికులు చెబుతుంటారు. ఆమంచి కృష్ణ మోహన్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరి నుంచి తోడుగా నిలిచిన స్వాములు జనసేనలో చేరుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఒకే మాటగా కలిసిమెలిసి ఉన్న సోదరులు ఇప్పుడు వేరు వేరు పార్టీల్లో ఉండటటం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇంఛార్జ్‌గా కృష్ణమోహన్ ఉన్నారు. మొత్తానికి ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు అయిన స్వాములు జనసేన చేరనుండడంపై స్థానిక కాపు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు