/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amalapal-5-2-jpg.webp)
Amala paul: అందాల నటి అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది. టూరిజం-హాస్పిటాలిటీ రంగ నిపుణుడు జగత్ దేశాయ్ తో కొన్నాళ్లుగా అమలా పాల్ ప్రేమలో ఉంది. నేడు కేరళలోని కొచ్చిలో ఓ హోటల్ లో అమలా పాల్, జగత్ దేశాయ్ పెళ్లితో ఒక్కటయ్యారు.
View this post on Instagram
ఇటీవల నటి అమలా పాల్ తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి జీవితానికి ఓకే చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. అమలా పాల్ బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్.. ఆమెకు ప్రపోజ్ చేయడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయింది.
అందుకు సంబంధించిన వీడియోని ఇద్దరు కలిసి తమ సోషల్ మీడియాలో పోస్టు చేయగా బాగా వైరల్ అయ్యింది. ఇక ఇలా ప్రపోజల్ కి ఒకే చెప్పిందో లేదో వెంటనే పెళ్లి పీటలు ఎక్కేసారు.
అమలా పాల్ కు గతంలో ఓసారి వివాహమైంది. దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకే విభేదాలు తలెత్తడంతో వీరు విడిపోయారు.
ఆ తర్వాత అమలా పాల్... జగత్ దేశాయ్ కి దగ్గరైంది. జగత్ దేశాయ్ తన ప్రేయసి అమలా పాల్ కు లవ్ ప్రపోజ్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా, వీరిద్దరూ పెళ్లితో తమ జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను జగత్ దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.