అల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు ఘటనలో వ్యక్తి అరెస్టు

నిత్యం రద్ధీగా ఉండే అల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు పెట్టినట్టు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గౌస్‌ పాషాను మోండా మార్కెట్ పోలీసులు ఖమ్మంలో అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు.

New Update
అల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు ఘటనలో వ్యక్తి అరెస్టు

Bomb threat to Alpha Hotel: నిత్యం రద్ధీగా ఉండే అల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు పెట్టినట్టు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గౌస్‌ పాషాను మోండా మార్కెట్ పోలీసులు ఖమ్మంలో అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. శనివారం రాత్రి హోటల్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు వెంటనే అలర్ట్‌ అయ్యారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అర్ధరాత్రి వరకూ తనిఖీ చేసినా అక్కడ బాంబు దొరక్కపోవడంతో అది ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధరించుకున్నారు. అనంతరం ఫేక్ కాల్ ట్రేస్‌ చేశారు.

ఇది కూడా చదవండి: Medaram Jatara: మేడారంలో 9 కి.మీ. ట్రాఫిక్ జామ్.. పోటెత్తిన భక్తులు

హోటల్‌కు బెదిరింపుల నేపథ్యంలో పోలీసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ పరిసర ప్రాంతాలన్నీ సాధారణంగా నిత్యం రద్దీగా ఉంటుంటాయి. స్థానికుల్లోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బెదిరింపు అందుకున్న వెంటనే పోలీసులు ఆల్ఫా హోటల్‌ వద్దకు చేరుకుని హోటల్‌ సిబ్బందిని బయటకు పంపేసి ఖాళీ చేయించారు. చివరకు హోటల్‌లో బాంబు లేదని తేల్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు