Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ రిలీజ్.. బాక్స్ ఆఫీస్ వద్ద సునామే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం పుష్ప 2. రేపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టీజర్ రానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 'పుష్ప 2' టీజర్ రేపు ఉదయం 11.07 గంట‌ల‌కు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

Pushpa 2 Teaser: పుష్ప 2  టీజర్ రిలీజ్.. బాక్స్ ఆఫీస్ వద్ద సునామే..!
New Update

Pushpa 2 The Rule Teaser: 2024 లో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022లో పార్ట్ 1 తో సంచలనం సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడు పార్ట్ 2 తో మరో సారి రికార్డులు తిరగరాయడానికి సిద్దమవుతోంది. ఇప్పటికీ పుష్ప పార్ట్ 1 హవా కొనసాగుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. కాగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 ఆగస్టు 15 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Also Read: Narudi Brathuku Natana: ‘నరుడి బ్రతుకు నటన’.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గ్లింప్స్

Pushpa 2 Teaser

పుష్ప 2 టీజర్ అప్డేట్

ఈ నేపథ్యంలో ఇటీవలే అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ వదిలారు. రేపు ఉదయం 11.07 గంట‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

Pushpa 2 Teaser

పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించగా.. ఫహద్ ఫాసిల్, ధనంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Also Read : Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’ లో అలాంటి పాత్ర చేయడానికి కారణం ఇదే.. వైరలవుతున్న అనుపమ కామెంట్స్..!

#pushpa-2-teaser
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe