Allu Arjun: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పై జర్నలిస్ట్ భరద్వాజ షాకింగ్ కామెంట్స్..?

అల్లు అర్జున్ కు జాతీయ పురస్కారం రావడంపై సినీ అభిమానులు చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయనకు మించిన నటులు లేరా? అన్న ప్రశ్న కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే.. ఇలాంటి వాఖ్యానాలు సరికాదని ప్రముఖ సినీ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ అన్నారు.

New Update
Allu Arjun: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పై జర్నలిస్ట్ భరద్వాజ షాకింగ్ కామెంట్స్..?

Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల వాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రముఖ సినీ జర్నలిస్ట్ భరద్వాజ స్పందించారు. ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని పురస్కారం అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారని అన్నారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తీసుకుంటున్న సమయంలో అల్లు అరవింద్ పుత్రోత్సాహంతో చాలా ఆనందంగా కనిపించారన్నారు. ఇది అల్లు అర్జున్ జీవితంలో ఒక మరిచిపోలేని ఘటనగా అభివర్ణించారు భరద్వాజ.

అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ఇస్తున్నారు అనే వార్త బయటకు రాగానే దాని పై రకరకాల అభిప్రాయాలు వినిపించాయన్నారు. తెలుగులో ఇంతటి నటుడు లేడా అంటూ చాలా కంప్యారిజన్స్ వచ్చాయని అన్నారు. ఇంతటి నటులు లేరా? అంటే చాలా మంది ఉన్నారన్నారు. కానీ అప్పటి సినిమాలు, వాతావరణం, అప్పటి నటులు వేరని అన్నారు. ఇప్పటి సినిమాలు, నటీ నటులు వేరు కాబట్టి ఆనాటి మహానటులతో అల్లు అర్జున్ ను పోల్చడం అనేది అటు వాళ్ళను అగౌరవపరిచినట్లే అని అన్నారు. ఇలా చేయడం ఇటు అల్లు అర్జున్ ను కూడా అగౌరవపరచినట్లేనని అన్నారు. ఎప్పటికప్పుడు నడుస్తున్న పోటీని బట్టే అవార్డులు ఆధారపడి ఉంటాయన్నారు. అంతే కానీ వాళ్ళ కంటే వీళ్ళు గొప్పవాళ్ళు అని కాదన్నారు.

పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Also Read: Prabhas: ప్రభాస్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌ మిస్సింగ్.. హ్యాక్ అయ్యిందా..? డియాక్టివేట్‌ చేశారా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు