Allu Arjun: వైసీపీ అభ్యర్థి ఇంట్లో అల్లు అర్జున్.. రచ్చ..రచ్చ చేస్తున్న అభిమానులు..!

నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటి దగ్గర టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. పుష్ప రాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు ఐకాన్ స్టార్. ఆయనను చూడగానే ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తించారు.

New Update
Allu Arjun: వైసీపీ అభ్యర్థి ఇంట్లో అల్లు అర్జున్.. రచ్చ..రచ్చ చేస్తున్న అభిమానులు..!

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు. తన భార్య స్నేహ రెడ్డితో కలిసి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లారు.హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తూ తన స్నేహితుడు రవికి ఇంటికి వెళ్లడంతో పుష్ప రాజ్ ను చూసేందుకు అభిమానులును పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Also Read: పిఠాపురంలో హై ఓల్టేజ్.. అటు మెగా పవర్ స్టార్.. ఇటు జగన్ సర్కార్..!

అభిమానులకు అభివాదం చేశారు ఐకాన్ స్టార్. ఆయనను చూడగానే ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తించారు. ప్రచారం చివరి రోజు కావడంతో అల్లు అర్జున్‌ రావడంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించారు మెగా హీరో. దీంతో మెగా అభిమానులు కన్యూజన్ లో పడ్డారు. మొన్న జనసేన అధినేత పవన్ కు అండగా నిలిచిన హీరో ఇప్పుడు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు