హత్యలు, హత్యాయత్నాలతో నంద్యాల రాజకీయం వేడెక్కింది. అనుచరులతో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణమైన ఏవీ సుబ్బారెడ్డి విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని అఖిల డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ విషయంపై నేరుగా సీఎం చంద్రబాబు దగ్గరకే వెళ్లాలని అఖిలప్రియ నిర్ణయించుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నంద్యాలలో జరుగుతున్న పరిస్థితులతో పాటు ఏవీ సుబ్బారెడ్డి తమ వర్గీయులపై చేయిస్తున్న దాడులను సీఎంకు వివరించాలని అఖిల భావిస్తున్నారు.
ఈ మేరకు ఇప్పటికే ఆమె చంద్రబాబు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకు అఖిల బాడీ గార్డును కారుతో గుద్ది చంపే ప్రయత్నం జరిగింది. అయితే.. ఈ దాడి నుంచి అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మంగళవారం సాయంత్రం అఖిలప్రియ అనుచరురాలు శ్రీదేవి హత్య జరిగింది. శ్రీదేవి భర్త AV భాస్కర్ రెడ్డిపైనా కూడా దాడి జరిగింది. గత ఎన్నికల సమయంలో ఏవీ భాస్కర్ రెడ్డి దంపతులు అఖిల ప్రియ గెలుపుకోసం కీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే వారిపై దాడి జరిగిందన్న చర్చ నంద్యాలలో జోరుగా సాగుతోంది. దీంతో అఖిల నెక్స్ట్ స్టెప్ ఏంటన్న అంశం ఉత్కంఠగా మారింది.