Singareni Elections: ఈ నెల 27న జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 39,748 కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు 700మంది సిబ్బందిని కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరగనున్న ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 1998 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలిసారి ఏఐటీయూసీ విజయం సాధించింది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా మూడుసార్లు ఏఐటీయూసీ, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి.
ఇది కూడా చదవండి: Chiranjeevi – Revanth: రేవంత్‌రెడ్డిని కలిసిన మెగాస్టార్.. ఫొటోలు, వీడియో వైరల్!
సింగరేణి వ్యాప్తంగా వివిధ డివిజన్లో ఉన్న ఓటర్ల వివరాలు:
1. బెల్లంపల్లి 986
2. మందమర్రి 4876
3. శ్రీరాంపూర్ 9,124
4. కార్పొరేషన్ 1192
5. కొత్తగూడెం 2370
6. మణుగూరు 2414
7. ఇల్లందు 603
8. నైని (ఒడిస్సా) 2
9. భూపాలపల్లి 5350
10. రామగుండం-1 5430
11. రామగుండం-2 3479
12. అడ్రియాల 947
13. రామగుండం-3 3063
మొత్తం: 39,748
గత ఎన్నికలలో గెలుపొందిన యూనియన్లు:
1998 - ఏఐటీయూసీ 31,938
2001 - ఏఐటీయూసీ 21599
2003 - ఐఎన్టీయూసీ 30,291
2007 - ఏఐటీయూసీ 30,385
2012 - టీబీజీకేఎస్ 23,311
2017 - టీబీజీకేస్ 23,845
రీజియన్ వ్యాప్తంగా ఓట్ల వివరాలు:
రామగుండం - 12,824, బెల్లంపల్లి - 14,960, కొత్తగూడెం - 6,581, భూపాలపల్లి - 5,410.