మణిపూర్ అల్లర్లపై నేడు అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం..!! ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గత కొంతకాలంగా హింసాత్మక ఘటన చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. మణిపూర్‌లో మే 3 నుండి కాల్పుల లాంటి సంఘటనలు కొనసాగుతున్నందున, అశాంతిని నియంత్రించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధాన్ని ఐదు రోజులు, జూన్ 25 వరకు పొడిగించింది. By Bhoomi 24 Jun 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నేడు దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది . ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. మే 3 నుండి మణిపూర్‌లో కాల్పుల వంటి సంఘటనలు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధాన్ని ఐదు రోజులపాటు అంటే, జూన్ 25 వరకు పొడిగించింది. మే 3న చెలరేగిన హింస: మే 3న మణిపూర్‌లో షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింసాత్మక వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో శాంతి, సామరస్యం కోసం విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మణిపూర్‌లో ప్రజల జీవితాలను నాశనం చేస్తుందని..మన దేశం యొక్క మనస్సాక్షిపై లోతైన గాయాన్ని మిగిల్చిందన్నారు. నేడు అఖిలపక్ష సమావేశం: జాతి, హింస, ఘర్షణల నేపథ్యంలో మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి జూన్ 24 న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోడీ దేశంలోలేని సమయంలో అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటూ ప్రశ్నించారు. మోడీకి దేశం కంటే అమెరిక పర్యటనే ముఖ్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "50 రోజుల నుంచి మణిపూర్ మండుతున్నప్పటికీ ప్రధాని మౌనం వహించారు. స్వయంగా ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం పెట్టారు! సహజంగానే, ప్రధానికి ఈ సమావేశం ముఖ్యమైనది కాదు"-రాహుల్ గాంధీ. కాగా మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని మోడీ మౌనం వహించడంపై కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మండిపడ్డారు . గత 53 రోజులుగా మణిపూర్ కాలిపోతోంది, ప్రధాని మోడీ ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి