AP Politics: ఖాకీలు వలయంలో కాకినాడ కౌంటింగ్ సెంటర్.. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ జె నివాస్

కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం చుట్టూ భారీగా రాబిట్ ఫోర్స్ కేంద్ర బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. కాకినాడలో కాకినాడ పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కలెక్టర్ జె నివాస్ తెలిసారు. డిక్లరేషన్ ఫామ్, పాస్ ఉంటేనే కౌంటింగ్‌కి అనుమతి ఇస్తామన్నారు.

AP Politics: ఖాకీలు వలయంలో కాకినాడ కౌంటింగ్ సెంటర్.. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ జె నివాస్
New Update

AP Politics: కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో.. కాకినాడ పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కలెక్టర్ జె నివాస్ తెలిసారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం.. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం చుట్టూ భారీగా రాబిట్ ఫోర్స్ కేంద్ర బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. రేపు ఉదయం 7 గంటలకే కాకినాడ జేఎన్టీయూ మెన్‌గేట్ మూసివేస్తుమని తెలిపారు. ఆరు గంటలకే ఏజెంట్లు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచన చేశారు.డిక్లరేషన్ ఫామ్, పాస్ ఉంటేనే కౌంటింగ్‌కి అనుమతి ఇస్తామన్నారు.

ఎటువంటి సంబరాలు చేసుకోడానికి లేదు:

కాకినాడ పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌కి సందర్భంగా కాకినాడ టౌన్‌లోకి వచ్చే ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీకి 25, పార్లమెంటుకు 14 మొత్తం 39,ఏడు నియోజకవర్గాలకు 243 టేబుల్స్‌పై కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. మొదటి రౌండ్ ఫలితం 9.30కి వస్తుందన్నారు. 6 తారీఖు వరకు జిల్లాలో 144 సెక్షన్  అమలులో ఉంటుందని తెలిపారు. మూడు అంచుల భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతుందన్నారు. మొబైల్ ఫోన్లు తీసుకు వస్తె చీజ్ చేస్తామన్నారు. గెలిచిన అభ్యర్థులు ఎటువంటి సంబరాలు చేసుకోడానికి లేదని కాకినాడ పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం..శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు: పోలీసులు

#ap-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe