అయోధ్య రాములోరికి కానుకగా 400కేజీల భారీ తాళం

దశాబ్దాలుగా హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రానుంది. ఎన్నో వివాదాలు, మరెన్నో ఆటంకులు దాటుకుని అయోధ్యలో రాములోరి ఆలయం రెడీ అవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంంలో ఎంతో వైభవంగా రామమందిరం ప్రారంభంకానుంది.

అయోధ్య రాములోరికి కానుకగా 400కేజీల భారీ తాళం
New Update

కొందరు భక్తులు తమ ఇష్ట దైవం కోసం కానుకులు ఇస్తూ ఉంటారు. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు కానుకలు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. డబ్బులు ఉన్న వారు అయితే బంగారు ఆభరణాలు ఆలయ ధర్మకర్తలకు సమర్పిస్తుండటం వింటూనే ఉంటాం. కానీ యూపీలోని అలీఘర్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ అనే రామ భక్తుడు వినూత్నంగా ఆలోచించాడు. తాళాలు చేసే వృత్తిలో ఉన్న శర్మ అనే వృద్ధుడు త్వరలో ప్రారంభంకానున్న అయోధ్య రామమందిరానికి కానుకగా ఇవ్బడం కోసం 400కేజీల బరువున్న భారీ తాళం తయారుచేశాడు. దీని తయారీ కోసం రూ.2లక్షలు ఖర్చుచేశారు. మొత్తం పని పూర్తి కావడానికి మరో రూ.3లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఆయల అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.

తాళాలు పరిశ్రమలకు అలీఘర్ ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి శర్మ కుటుంబం తాళాలు తయారుచేసే వృత్తిలో కొనసాగుతూ వస్తోంది. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరానికి తన వంతుగా ఏదైనా ఇవ్వాలని అనుకున్నారు సత్యప్రకాశ్‌. అంతేకాదు తాను ఇవ్వబోయే కానుక ప్రపంచంలో ఎక్కడా లేనిది అయ్యి ఉండాలని భావించారు. దీంతో భారీ తాళం తయారు చేసేందుకు పూనుకున్నారు. ఇందుకోసం ఆరు నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్దదైన చేతితో తయారుచేసిన తాళాన్ని సిద్ధం చేశారు. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని తయారుచేశారు. ఇక నాలుగు అడుగుల తాళం చెవిని కూడా రూపొందించారు. ఈ భారీ తాళం తయారు చేడంలో తన భార్య రుక్మిణి ఎంతగానో సహకరించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వార్షిక అలీగఢ్‌ ప్రదర్శనలో ఈ భారీ తాళాన్ని కూడా ఉంచారు. ఈ ఏడాది చివర్లో తాళం రామజన్మభూమి ట్రస్ట్‌కు అందజేస్తానని తెలిపారు.

ఇక వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో అయోధ్య రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. ఈ వేడుకకు దాదాపు 10,000 మంది అతిథులను బోర్డు ఆహ్వానిస్తుందని రామమందిర్ బోర్డు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఆలయ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 5, 2020న కరోనా మార్గదర్శకాలు అనుసరించి ప్రారంభమైంది. అప్పటి నుంచి శరవేగంగా పనులు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుంది. దీంతో వచ్చే జనవరి నెలలో ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ కార్యక్రమంలో కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయోధ్యలో జరిగే పవిత్రాభిషేక మహోత్సవానికి వచ్చే భక్తులకు దాదాపు నెల రోజుల పాటు ఉచితంగా భోజనం అందించాలని ట్రస్ట్ భావిస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe