TS: విద్యార్థులకు అలర్ట్..రేపు స్కూళ్లకు సెలవు..!!

తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా రేపు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది.ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం రేపు షబ్ ఎ మోరాజ్ కు సెలవు రోజుగా ప్రకటించింది.

New Update
Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం

Holiday For Schools: తెలంగాణలోని విద్యార్థులకు, ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక. ఫిబ్రవరి 8న (February 8) ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ఆరోజున ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవని సర్కార్ వెల్లడించింది. ఈ విషయాన్ని విద్యార్థులు, ఉద్యోగులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సాధారణంగా ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీని షబ్ ఎ మోరాజ్ కు సెలవు రోజుగా ప్రకటించింది. అయితే దీనిని ప్రస్తుతం సాధారణ సెలవుగా మార్చింది. షబ్ ఎ మెరాజ్ (Shab e Meraj) ముస్లింలకు పవిత్రమైన రోజు.

ఆరోజు పర్వానా మసీదులను దీపాలతో డెకరేట్ చేస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటన విడుదల కావడంతో ప్రభుత్వ ఆఫీసులు, పాఠాశాలలకు సెలవుగా మారింది. కాగా ఈ సెలవు తర్వాత ఫిబ్రవరిలో సాధారణ సెలవులేమీ లేవు. సాధారణ పండుగలు జనవరి తర్వాత మార్చిలోనే ఉంటాయి. సర్కార్ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రభుత్వ సెలవు ఉంది. మార్చిలోనే హోలీ పండగ ఉంది. మార్చి 29న గుడ్ ఫ్రైడే ఉంది. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హాలీడే ప్రకటించారు.

ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 11,12న రంజాన్ సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు కూడా ఉంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమికి కూడా సెలవు ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.

ఇది కూడా చదవండి:  BSNL, ఎయిర్ ఇండియాను కాంగ్రెస్ సర్వనాశనం చేసింది… లాస్ట్ స్పీచ్ లో విశ్వగురువు విశ్వరూపం..!!

Advertisment
తాజా కథనాలు