తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు..!!

భారీ వర్షాలతో ఉత్తరభారత తడిసిముద్దైతుంది. వరద తాకిడికి నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలకు ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా నైరుతి రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

New Update
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు..!!

నైరుతి రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రంలో తెలిపింది. నైరుతి బంగాళఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్న నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏపీలోని యానాం, ఉత్తరకోస్తలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Rains in AP from tomorrow

ఈనెల 12,13 తేదీల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమతోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.

అటు తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు , ఎల్లుండి మూడు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు