TS Inter : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు డేట్ పై కీలక ప్రకటన..!!

ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు తేదీని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే సంవత్సరం 2024 మార్చి లో నిర్వహించనున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల డేట్ ఇదే!
New Update

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ పరీక్షల ఫీజు తేదీని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే సంవత్సరం 2024 మార్చి లో నిర్వహించనున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

కాగా లేట్ ఫీజుతో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. నవంబర్ 16 నుంచి 23 వరకు రూ. 100 ఆసల్య రుసుముతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు రూ. 500 ఆలస్య ఫీజుతో డిసెంబర్ 6 నుంచి 13 వరకు వెయ్యి రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు రెండు వేల రూపాయల లేట్ ఫీజుతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది ఇంటర్ బోర్డు.

ఇది కూడా చదవండి:  ఏ క్షణమై ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

ఇక తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షరద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్ సెబ్జెక్టుల్లో వీలినం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్-3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కాగా మరో ఇంటర్నల్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఎప్పటిలాగే యథాతథంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 100మార్కుల ఈ ఇంటర్నల్ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి..అదే కళాశాల లెక్చరర్లు మూల్యాంకనం చేసి మార్కులు ఇస్తారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాగా ,ఈ మార్కులను రెగ్యులర్ మార్కుల్లో యాడ్ చేయరు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొదటి సంవత్సరంలో ప్రాక్టికల్స్ అమలు చేయడంతోపాటు థియరీకి, ప్రాక్టికల్స్ కు వేరు వేరుగా పాఠ్య పుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లీష్ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలు అంతర్భాంగా ఉండటంతో ప్రత్యేక పరీక్ష అవసరం లేదని అధికారులు భావించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

publive-image

#ts-inter #ts-inter-exams #ts-inter-exams-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe