YS Jagan: ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav).. మాజీ సీఎం జగన్ కు మద్దతు తెలిపారు. వైసీపీ నేతలపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తున్నారు. జంతర్‌మంతర్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. కార్యకర్తలపై దాడులను వైసీపీ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో ఏర్పాటు చేసింది. ఏపీలోని పరిస్థితులపై వీడియో ప్రదర్శన నిర్వహించింది.
Also Read: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
అఖిలేష్ మద్దతు ..
ఈ నేపధ్యంలో జగన్ ధర్నాకు మద్దతు తెలిపారు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అధికారం అనేది శాశ్వతం కాదని.. ఇవాళ చంద్రబాబు (Chandrababu) సీఎం అయ్యారు, రేపు జగన్ సీఎం కావచ్చని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదన్నారు. ఏపీలో శాంతియుత వాతావరణం నెలకొనాలని.. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రత్యర్ధుల ప్రాణాలు తీయడం సరికాదని ఉద్ఘాటించారు.
లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 30 మందిని చంపారన్నారు. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకుని నచ్చనివారిపై దాడి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఏపీలో ఫ్రీ గ్యాస్ అమలు.. అసెంబ్లీలో కీలక ప్రకటన..!