Akasa air Lines: ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేత..అసలు విషయం ఏంటంటే!

ఆకాశ ఎయిర్ లైన్స్‌ (Akasa airLines) అనగానే గుర్తుకు వచ్చే పేరు బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh JunjunWala)...ఆయన చనిపోయిన తరువాత ఆకాశ ఎయిర్‌ లైన్స్ నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.

New Update
Akasa air Lines: ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేత..అసలు విషయం ఏంటంటే!

ఆకాశ ఎయిర్ లైన్స్‌ (Akasa airLines) అనగానే గుర్తుకు వచ్చే పేరు బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh JunjunWala)...ఆయన చనిపోయిన తరువాత ఆకాశ ఎయిర్‌ లైన్స్ నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఆగస్టులో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎయిర్‌ లైన్స్‌ చాలా తక్కువ ధరకే టికెట్లు అందించింది.

అయితే ఆఖరి నిమిషంలో విమానాలు రద్దు కావడంతో ఆ టికెట్ల డబ్బును కూడా తిరిగి ఇచ్చేశారు. ఇలా విమానాలు ఆఖరి నిమిషంలో రద్దు కావడానికి ముఖ్య కారణం పైలెట్లు సడెన్‌ గా సంస్థకు రాజీనామా చేయడమే అని వినికిడి. గత కొద్ది కాలంలో పైలెట్లు ఆకస్మాత్తుగా రాజీనామాలు చేసి వెళ్లిపోయారు.

అయితే రాజీనామాలు చేసిన పైలెట్లు అందరూ కూడా కనీసం కాంట్రాక్ట్‌ పీరియడ్ కూడా పూర్తి చేయకుండానే వేరే కంపెనీకి జంప్‌ అయిపోతున్నారు. దీంతో విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. జూనియర్ పైలేట్లే ఎక్కువగా ఇలా చేస్తుండడంతో కంపెనీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే తమకు పరిహారం చెల్లించాలని సడెన్‌ గా వెళ్లిపోయిన 43 మంది పైలెట్లకు ఆకాశ ఎయిర్‌ లైన్స్ పిటిషన్లు ఇచ్చింది. వీటిన్నంటిని తెలుసుకున్న కొందరు ఆకాశ ఎయిర్‌ లైన్స్‌ ను మూసివేస్తున్నట్లు ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆకాశ ఎయిర్ లైన్స్‌ సీఈఓ వినయ్‌ దూబే స్పందించారు.

పైలెట్ల ఆకస్మిక రాజీనామాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఎయిర్‌ లైన్స్‌ ను మూసివేస్తున్నమనే మాట మాత్రం నిజం కాదు అని తెలిపారు. ఆయన ఇలాంటి వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు. ఈ వదంతుల నేపథ్యంలో సంస్థకు చెందిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని వారికి ఆందోళన చెందవద్దని మెయిల్స్ కూడా పంపినట్లు తెలిపారు.

ప్రయాణికులు తమ సంస్థ వాళ్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకే కొన్ని విమానాలను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. సంస్థ పై ప్రయాణీకులు నమ్మకాన్ని కోల్పోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినయ్ దూబే వివరించారు. సంస్థ అతి త్వరలోనే విజయాలను అందుకుంటుందని ఆయన వివరించారు.

ఇక గతేడాది ప్రారంభమైన ఆకాశ ఎయిర్ లైన్స్ ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ వంటి 16 నగరాలను కలుపుతూ 35 ప్రత్యేక మార్గాల్లో ఆపరేట్ చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు