Ajith : 'విశ్వంభర' సెట్స్ లో అజిత్.. 20 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ ను కలిసిన కోలీవుడ్ స్టార్!

New Update
Ajith : 'విశ్వంభర' సెట్స్ లో అజిత్.. 20 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ ను కలిసిన కోలీవుడ్ స్టార్!

Kollywood Star Ajith Meets Chiranjeevi : కోలీవుడ్ స్టార్ అజిత్ తాజాగా విశ్వంభర మూవీ సెట్స్ కి వెళ్లారు. ఈ సందర్భంగా సెట్ లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం అజిత్ రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్న అజిత్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర సెట్స్ ని సందర్శించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

20 ఏళ్ళ తర్వాత

మెగాస్టార్ చిరంజీవిని అజిత్ సుమారు 20 ఏళ్ళ తర్వాత కలిశారు. అజిత్ నటించిన 'ప్రేమ పుస్తకం' సినిమా ప్రారంభోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి తన అభినందనలు తెలిపారు. హీరో, హీరోయిన్ తో కలిసి ఫోటో కూడా దిగారు. ఇది జరిగి 20 ఏళ్ళు అవుతుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అజిత్ స్వయంగా చిరంజీవి కొత్త సినిమా సెట్స్ కి వచ్చి ఆయన్ని కలవడం విశేషం.

Also Read : ‘టిల్లు 3’ లో రాధిక పాత్ర కంటిన్యూ అవుతుందా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

publive-image

ఇక సెట్ లో అజిత్ ను ఆహ్వానించిన చిరు.. అతనితో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇద్దరూ తమ సినిమాల గురించి డిస్కస్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, అజిత్ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పిక్ ఇరు హీరోల ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు