CBI News: వాషీంగ్ పౌడర్ నిర్మ.. ఎన్డీయేలో చేరగానే ఆ నేతపై కేసులు ఎత్తేశారుగా! ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్‌పై ఉన్న కేసును సీబీఐ ఎత్తివేసింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగింపు కోసం కోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రఫుల్ ప్రస్తుతం ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. By Trinath 30 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి వాషీంగ్ పౌడర్ నిర్మా యాడ్ గుర్తుందా? ఎంత మూరికి ఉన్నా నిర్మా పౌడర్ కొనగానే అవి మాయమౌతాయి. యాడ్‌లో ఒక దెబ్బకు మురికి మొత్తం వ్యానిష్ అవుతుంది. అలానే ఎన్డీఏలో కానీ, బీజేపీలో కానీ చేరితే వెంటనే సీబీఐ కేసులు ఎత్తేశారట. ఇది కాంగ్రెస్ చెబుతున్న మాట. తాజాగా ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌పై ఉన్న అవినీతి కేసును సీబీఐ మూసివేసింది. ప్రస్తుతం ప్రఫుల్ పటేల్ కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. గతేడాది జూలైలో అజిత్ పవార్‌తో పాటు ప్రఫుల్ పటేల్ కూడా ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే! 8 నెలలకే మంచోడు: అజిత్ గ్రూపులో చేరిన 8 నెలలకే సీబీఐ ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. మే 2017లో ప్రఫుల్ పటేల్ ఆధ్వర్యంలోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులపై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ప్రఫుల్ నడుచుకున్నారని కేసు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దాఖలు చేశారు. మధ్యవర్తి దీపక్ తల్వార్‌కు ప్రఫుల్ పటేల్ సన్నిహిత మిత్రుడని 2019 మేలో ఈడీ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. దీపక్ తల్వార్ 2008-09 సమయంలో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ లాభదాయకమైన ఎయిర్ ఇండియా రూట్‌లను విస్తరించడంలో సహాయపడినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే జాయిన్ అయ్యాడా? గతేడాది(2023) జూన్‌లో ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో కలిసి ప్రఫుల్ పటేల్ పాట్నాలో జరిగిన ప్రతిపక్ష వర్గ సమావేశానికి హాజరయ్యారు. ఆయన అప్పుడు శరద్ పవార్‌తో ఉన్నారు. అయితే నెల తిరిగేలోపు ప్రఫుల్ పటేల్ మరో ఆరుగురు NCP నాయకులతో కలిసి అజిత్ పవార్ వర్గంలో చేరారు. వీరంతా ప్రస్తుతం NDAలో భాగంగా ఉన్నారు. సీబీఐ విచారణ కారణంగానే ప్రఫుల్ పటేల్ బీజేపీ కూటమిలో చేరారని అప్పట్లో కాంగ్రెస్‌తో పాటు శరద్ పవార్ వర్గం ఆరోపించింది. Also Read: చికెన్‌కు రూ.250, మటన్‌కు రూ.500.. ఈసీ మెనూకార్డులో టీ, ఇడ్లీ ధర ఎంతో తెలుసా? #praful-patel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి