AP Politics: బీజేపీపై మండిపడ్డ రఘువీరారెడ్డి..కలిసి పోరాటం చేయాలని పిలుపు

బలమైన పార్టీగా ఉన్న కమ్యునిస్టు పార్టీలు బలహీనపడ్డాయన్నారు రఘువీరారెడ్డి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితికి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరూ ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని రఘువీరారెడ్డి సూచించారు.

AP Politics: బీజేపీపై మండిపడ్డ రఘువీరారెడ్డి..కలిసి పోరాటం చేయాలని పిలుపు
New Update

రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్న సమయంలో సీడబ్య్లూసీలో అవకాశం ఇచ్చారని ఏఐసీసీ సభ్యులు రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మట్లాడుతూ.. ఎపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేయాలని జాతీయ పార్టీ ఆదేశించిందన్నారు. బలమైన పార్టీగా ఉన్న కమ్యునిస్టు పార్టీలు బలహీన పడ్డాయని రఘువీరారెడ్డి అన్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు అందరూ ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని రఘువీరారెడ్డి సూచించారు.

తుపాకులు పెట్టీ ప్రభుత్వం ఏర్పాటు

దేశంలో నెలకొన్న విచ్చిన్నకర రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్ని శక్తులు ఏకం అయ్యాయని అయ్యాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో అహంకార పూరిత రాజకీయ వాతావరణం సృష్టిస్తుందని ఏఐసీసీ సభ్యులు ఆరోపించారు. బీజేపీ బలహీనంగా ఉన్న చోట భుజాలపై తుపాకులు పెట్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని విమర్శలు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర సున్యమని రఘువీరారెడ్డి ఆరోపించారు. నల్ల చట్టాలు తెచ్చి బలవంతంగా అమలు చేయాలని చూస్తున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చి 2034లో అమలు చేస్తామని చెప్తున్నారు. ఇండియా కూటమిలో అన్ని 28 పార్టీలు భాగస్వామ్యం అయ్యాయి రఘువీరారెడ్డి అన్నారు.

ఈ మూడు పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించలేవు

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పాటు సీపీఐ కూడా కలిసి పోరాటం చేస్తుందన్నారు. ఇండియా కూటమిని ముందుకు తీసుకొని వెళ్లడం కోసమే ప్రత్యేకంగా ఈరోజు భేటీ అయ్యామని రామకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంట్‌లో టీడీపీ, వైసీపీలు బీజేపీకి మద్దతు పలికాయి ఆయన విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉందని రామకృష్ణ ఆరోపించారు. అమిత్‌షా, మోదీ ఇద్దరు కలిసే చంద్రబాబును అరెస్ట్ చేయించారని రామకృష్ణ రోపించారు. తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎందుకు అంటగడుతుందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీపై మూడు పార్టీలు నోరు మెదపడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. జనసేన, టీడీపీ, వైసీపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేవు అని రామకృష్ణ జ్యోసం చెప్పారు.

ఇది కూడా చదవండి: పులియబెట్టిన ఆహారంతో ఆశ్చర్యపోయే ప్రయోజనాలు

#vijayawada #cpi-state-secretary-ramakrishna #aicc-member-raghuveera-reddy #ap-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe