Ahmednagar: అహ్మద్‌నగర్‌కు 'అహల్యానగర్'గా పేరు మార్చిన మహారాష్ట్ర సర్కార్..!

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పేరును అహల్యానగర్ గా మారుతూ నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హెల్కర్ పేరు మీదుగా అహల్యానగర్ గా మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.

Ahmednagar: అహ్మద్‌నగర్‌కు 'అహల్యానగర్'గా పేరు మార్చిన మహారాష్ట్ర సర్కార్..!
New Update

Ahmednagar:  మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కూడా ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దారిలోనే నడుస్తున్నారు. నగరాల పేరు మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే ఔరంగాబాద్ పేరు ఛత్రపతి శంభాజీ నగర్ గా, ఉస్మానాబాద్, ధరాశివ్ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నగరం పేరు మార్చుతూ ఏక్ నాథ్ షిండే మంత్రి నిర్ణయం తీసుకుంది. అహ్మద్ నగర్ పేరును అహల్యానగర్ గా మారుతూ నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హెల్కర్ పేరు మీదుగా అహల్యానగర్ గా మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. నగరానికి పేరు మార్చాలనే ప్రభుత్వ ప్రతిపాదనను మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే గతేడాది మేలో తొలిసారిగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిడ్నప్.. క్లారిటీ!

అహల్యా బాయి హోల్కర్ ఎవరో తెలుసా?

అహల్యాదేవి హోల్కర్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 1725వ సంవత్సరంలో అక్కడ జన్మించారు. మాల్వా రాజ్యానికి ఆమె వ్యవహారించారు. అహల్యాదేవికి చిన్నప్పటి నుంచి ప్రజలకు సాయం చేయాలనే తపన ఉండేది. చిన్నతనంలోనే ఖండేరావుతో వివాహం జరిగింది. 1754లో ఖండేరావు యుద్ధంలో వీరమరణం పొందారు. ఆ తర్వాత అహల్యాదేవిని హోల్కర్ కు సామ్రాజ్యాధిపత్యం అప్పగించారు. అహల్యాదేవి హోల్కర్ భారత చరిత్రలో అత్యుత్తమ రాణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక ధర్మశాలలను నిర్మించినత ఘనత అహల్యాబాయి హోల్కర్ కు దక్కింది. 1795 ఆగస్టు 13న అహల్యాబాయి హోల్కర్ తుది శ్వాస విడిచారు.

#maratha-queen-ahalyabai-holkar #maharashtra-chief-minister-eknath-shinde #ahalyanagar #ahmednagar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe