Aha OTT Platform Offer: ఈ రోజుల్లో సినిమాలకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. సినిమా హాళ్లకు ఆధరణ తగ్గి..ఓటీటీకీ భీభత్సమైన క్రేజ్ వచ్చింది. వాటిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అనగానే గుర్తొచ్చేవి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), నెట్ ఫ్లిక్స్ (Netflix), డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ప్రస్తుతం వీటి హవా నడుస్తోంది. పైన చెప్పిన స్ట్రీమింగ్ యాప్స్ అన్నీ వేరే దేశాలకు, ప్రాంతాలకు చెందినవి. కానీ మన తెలుగులో కూడా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉంది. అదే 'ఆహా'!
ఆహా - అనేది అర్హా మీడియా & బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన ఓటీటీ ప్లాట్ ఫ్లామ్. ఇది గీతా ఆర్ట్స్, మై హోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్. ఇది మొదటి తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్. 2020 మార్చి 25న దీన్ని ప్రారంభించారు. దీనిలో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఎక్స్‌క్లూజివ్స్, ఆహా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్స్, ఆహా ఒరిజినల్స్ తదితర కంటెంట్ ఉంటుంది. ఈ యాప్ అన్ని మొబైల్, టాబ్లెట్, వెబ్, స్మార్ట్ టీవీ, స్ట్రీమింగ్ డివైజ్‌ల్లో పనిచేస్తుంది. అన్‌స్టాపబుల్, సామ్ జామ్ లాంటి ప్రోగ్సామ్స్తో బాగా ఫేమస్ అయిందీ యాప్.
ఆహాలో 4 రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. వీటిల్లో 3 నెలల వ్యవధి కలిగినవి రెండు, ఏడాది వ్యవధి కలిగిన ప్లాన్స్ మూడు ఉన్నాయి. వినియోగదారులు తమ బడ్జెట్‌ను బట్టి తగిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
Also Read: హలీమ్ చేసుకోవడం ఇంత ఈజీనా.. టేస్ట్ అదిరిపోతుంది..!
ఆహా ప్లాట్‌ఫామ్ రూ.99లకే బేసిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 3 నెలలు. ఇందులో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉంటాయి. 720p రిజల్యుషన్‌తో హెచ్డీ క్వాలిటీ వీడియోలు చూడొచ్చు. స్టీరియో ఆడియో ఉంటుంది. కానీ ఇది కేవలం మొబైల్లోనే వస్తుంది. కంప్యూటర్ లేదా టీవీల్లో దీనిని చూడలేము. సపోర్ట్ చేయదు.
ఆహా రూ.199లకే మరో క్వార్టర్లీ ప్లాన్ అందిస్తోంది. దీనితో ఫుల్ హెచ్డీ (1080p) వీడియోలు చూడవచ్చు. స్టీరియో టైప్ ఆడియో ఉంటుంది. తెలుగు మూవీస్, వెబ్ సిరీస్‌లు వీక్షించవచ్చు. కానీ యాడ్స్ వస్తాయి. చాలా మంది ప్రిఫర్ చేసే ప్లాన్ ఇది.
ఆహా 3 రకాల ఇయర్లీ ప్లాన్స్ అందిస్తున్నాయి. వాటిలో మొదటి ప్లాన్ ధర రూ.399. ఈ ప్లాన్ తీసుకుంటే, 1080p రిజల్యుషన్‌తో ఫుల్ హెచ్డీ క్లారిటీతో వీడియోలు చూడవచ్చు. స్టీరియో టైప్ ఆడియో ఉంటుంది. తెలుగు మూవీస్, వెబ్ సిరీస్‌లను చూడవచ్చు. దీనిలో లిమిటెడ్ యాడ్స్ వస్తాయి.
ఆహా రూ.699కు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇస్తోంది. 1080p రిజల్యుషన్‌తో ఫుల్ హెచ్డీ వీడియోలు, స్టీరియో టైప్ ఆడియో ఉంటాయి. తెలుగు మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉంటాయి. ఎలాంటి యాడ్స్ రావు.
ఆహా గోల్డ్ ప్లాన్ ధర రూ.899. మిగతా ప్లాన్స్ కంటే బెస్ట్ క్వాలిటీ ఆడియో, వీడియోలు ఉంటాయి. 4K క్వాలిటీతో వీడియోలు, Dolby 5.1 టెక్నాలజీతో ఆడియోలు ఆస్వాదించవచ్చు. ఇందులో తెలుగుతో పాటు, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉంటాయి. వ్యాలిడిటీ ఒక సంవత్సరం. ఎలాంటి యాడ్స్ ఉండవు. పైగా ఈ ప్లాన్ తీసుకుంటే రూ.3000 విలువైన డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన ప్లాన్ తీసుకుని, ఆహా కంటెంట్‌ను ఆస్వాదించండి.