Agnibaan rocket: చివరి నిమిషంలో సాంకేతిక లోపం.. అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం వాయిదా

అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్‌ రికార్డ్ నెలకొల్పింది.

New Update
Agnibaan rocket: చివరి నిమిషంలో సాంకేతిక లోపం.. అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం వాయిదా

Agnibaan rocket:అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్‌ రికార్డ్ నెలకొల్పింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. ఈ రాకెట్ ను అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పెస్ సంస్థ రూపొందించింది. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా చేపట్టాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక లోపం తలెత్తడంతో వాయిదా పడింది. ఎనిమిది గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ప్రైవేట్‌ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు