Daggubati Abhiram's wedding: శ్రీలంకలో ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి సంబరాలు

దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. నిర్మాత సురేష్ దగ్గుబాటి చిన్న కుమారుడు అభిరామ్ దగ్గుబాటి వివాహం నేడు రాత్రి 8.50 నిమిషాలకు శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది.

Daggubati Abhiram's wedding: శ్రీలంకలో ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి సంబరాలు
New Update

Daggubati Abhiram's wedding: దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. నిర్మాత సురేష్ దగ్గుబాటి చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు అభిరామ్ వివాహం శ్రీలంకలో జరగనుంది. శ్రీలంకలో సముద్రం మధ్యలో ఉండే కలుతర రిసార్ట్స్ లో వివాహ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈరోజు 8.50 నిమిషాలకు ముహూర్తం. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ.. సురేష్ బాబు, అభిరామ్, మాళవిక, రానా, మిహీక దంపతులు, నాగ చైతన్య పెళ్లి వేడుకల కోసం శ్రీలంక వెళ్లారు.

publive-image

అభిరామ్ తనకు మరదలు వరుసయ్యే.. తన చిన్న తాత మనవరాలిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం దగ్గుబాటి రామా నాయుడు స్వస్థలం ప్రకాశం జిల్లాలో జరిగింది.  సోమవారం మొదలైన పెళ్లి వేడుకల్లో మెహందీ, హల్దీ, సంగీత్ ఇలా పలు ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి. శ్రీలంకలో ఘనంగా జరిగే వీరి పెళ్లి వేడుకలకు 200 మంది అతిథులు హాజరవుతున్నట్లు సమాచారం. శ్రీలంకలో పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత సన్నిహితులు, సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

publive-image

Also Read: Naga Chaitanya: నాగచైతన్య లైన్ క్లియర్.. సమంత పరిస్థితేంటి?

#abhirams-destination-wedding #daggubaati-abhiram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe