Republic Day celebrations:40 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన సంప్రదాయం..గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి

40 ఏళ్ళ తర్వాత పాత సంప్రదాయం మళ్ళీ వచ్చింది. రిపబ్లిక్ డే రోజు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి, ముఖ్యఅతిధి రావడం సంప్రాదాయంగా ఉండేది. కానీ మధ్యలో అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకు రాష్ట్రపతి ద్రైపది ముర్ము గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.

New Update
Republic Day celebrations:40 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన సంప్రదాయం..గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి

Republic day parede:2024 రిపబ్లికే డే రేడ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. 40 ఏళ్ళ తర్వాత రిపబ్లిక్ పరేడ్‌లో గుర్రపు బగ్గీ సంప్రదాయం మళ్ళీ వచ్చింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌది ముర్ము సాంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతితో పాటూ ఫ్రాన్ అధ్యక్షుడు మెక్కాన్ కూడా ఈ ప్రత్యేక వాహనంలోనే హాజరయ్యారు. వీరివురూ కలసి కర్తవ్యపథ్‌లోని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీనిని ద్రౌపది ముర్ము అంగరక్షకుడు ఎస్కార్ట్ చేశారు. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ నారీశక్తి థీమ్‌కు అనుగుణంగా రాష్ట్రపతి గుర్రపు బగ్గీలో రావడం అందరినీ ఆకర్షించింది.

Also Read:Telangana:గవర్నమెంటు స్కూలు విద్యార్ధులకు శుభవార్త..బూట్లు, టై, బ్యాగు, బెల్ట్…

గుర్రపు బగ్గీని ఎప్పుడు, ఎందుకు ఆపేశారు..

కాంగ్రెస్ నేత ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రిపబ్లిక్ పరేడ్‌కు రాష్ట్రపతి గర్రపు బగ్గీలో రావడం ఆపేశారు. అప్పట్లో ప్రధాని ఇంధిరాగాంధీని అంగరక్షకులే హత్య చేశారు. తుపాకీలతో కాల్చి చంపేశారు. ఈ ఘటన 1984లో జరిగింది. అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు గుర్రపు బగ్గీని ఉపయోగించడం నిలిపేశారు. అప్పటి నుంచి రాష్ట్రపతి ప్రయాణానికి లియోసిన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే 2014లో డీటింగ్ రిట్రీట్ వేడుకలో మాజీ రాష్ట్రపతి ప్రనబ్ ముఖర్జీ ఆరు గుర్రాల బగ్గీని నడిపి ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. కానీ ఎందుకనో అది మళ్ళీ కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ 2024లో ఈ గుర్రపు బగ్గీ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు.

బగ్గీ కథ...
అసలు రిపబ్లిక్ డే కార్యక్రమాల్లోకి ఈ గుర్రపు బగ్గీ రావడం వెనుక కూడా ఒక కధ ఉంది. అదేంటంటే..బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు ఆరు నల్ల గుర్రాలున్న బగ్గీని అప్పటి వైశ్రాయ్ వాడేవారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇండియా, పాకిస్తాన్‌లలో ఈ బగ్గీని ఎవరు వాడాలనే సందేహం వచ్చింది. దీనిని రెండు దేశాలు అదృష్టానికి వదిలేశాయి. అప్పటి ఇండియన్ కల్నల్ గోవింద్ సింగ్, పాకిస్తాన్ కల్నల్ సాహబ్‌జాదా యాకూబ్‌లు గుర్రపు బగ్గీ కోసం కాయిస్ టాస్ వేశారు. ఇందులో అదృష్టం భారత్‌నే వరించింది. అదిగో అప్పటి నుంచి భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి...రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంటులోకు గుర్రపు బగ్గీలో వెళ్ళడం అలవాటుగా మారింది. దీని తర్వాత ఇది రిపబ్లిక్ డే పరేడ్‌లోకి కూడా వచ్చింది.

అందరూ మహిళలే

కర్తవ్యపథ్‌లో (Kartavya Path) 90 నిమిషాల పాటు జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ కార్యక్రమంలో సైనిక శక్తితో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. అయితే ప్రతి ఏడాది లాగే ఈసారి గణతంత్ర దినోత్సవానికి థీమ్‌గా జాతీయ మహిళా శక్తితో (Women Power) పాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు. ఇక సైనిక ప్రదర్శనలో మన దేశంలోనే తయారుచేసిన ఆయుధాలతో సహా.. క్షిపణలు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, బీఎంపీ-2 సాయుధ శకటాలు ఉన్నాయి. అయితే ఈసారి పాల్గొననున్న త్రివిధ దళాల్లో అందరూ మహిళలే (Women) ఉన్నారు. చరిత్రలో మొదటిసారిగా దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్‌ గుర్తింపు రాడార్‌, పినాక రాకెట్‌ వ్యవస్థలకు పరేడ్‌లో నేతృత్వం వహించడం విశేషం. పరేడ్‌లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. మరోవైపు 15 మంది మహిళా పైలట్లు వాయు సేన విన్యాసాలను ప్రదర్శించారు.

Advertisment
తాజా కథనాలు