Afghanistan in Semis: ఒక్కోసారి కొత్త చరిత్ర సృష్టించడం అకస్మాత్తుగా జరిగిపోతుంది. ప్రపంచం నివ్వెరపోయేలా.. ఏమి జరిగింది అనే విషయం అర్ధం అయ్యేలోపు అద్భుతం జరిగిపోతుంది. క్రికెట్ లో అటువంటి అద్భుతాలు చాలానే జరుగుతాయి. కానీ, ఈరోజు జరిగిన అద్భుతం మాత్రం ఒక రేంజి ఉన్నది. ఎందుకంటే, ఈ అద్భుతం వెనుక ఒక ప్రధాన టోర్నీ నుంచి క్రికెట్ దిగ్గజం నాకౌట్ దశలోకి చేరకుండానే వెనక్కి వెళ్లిపోవడం ఉంది. పసికూన అని భావించే జట్టు నాకౌట్ దశకు చేరుకున్న గట్టి పట్టుదల ఉంది. అవును.. ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరడం ఒక అద్భుతమే. అది కూడా ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ టీమ్ ను ఓడించి.. టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసి మరీ సెమీస్ కు చేరింది అఫ్ఘానిస్తాన్. సూపర్ 8 లో తానాడిన 3 మ్యాచ్ లలో రెండిటిని గెలిచి 4 పాయింట్లతో సెమీ ఫైనల్ కు చేరుకుంది ఆఫ్ఘనిస్తాన్. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. అసలు ఈ విజయం అంత తేలికగా వచ్చింది కాదు. అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో సంబరాలు మిన్నంటాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆఫ్ఘన్ విజయం పట్ల హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ విజయంపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను ఇక్కడ మీరు చూడొచ్చు.
ICC Tweet:
Afghanistan Cricket Board Wishes:
Celebrations in Afghanistan:
Fans Social Media Messages:
The Historic Movements