Asia Cup: అరెరే పెద్ద పొరపాటే జరిగిందే.. అఫ్గాన్ కొంపముంచిన అంపైర్లు

చిన్న జట్టే కానీ గట్టి పోటీ ఇవ్వడంలో దిట్టగా ముందుంటుంది అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు. పెద్ద జట్లకు ఎన్నో సార్లు షాక్ ఇస్తూ మ్యాచులు గెల్చుకుంది. తాజాగా ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినంతా పని చేసింది. అయితే అంపైర్లు చేసిన పొరపాటుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Asia Cup: అరెరే పెద్ద పొరపాటే జరిగిందే.. అఫ్గాన్ కొంపముంచిన అంపైర్లు
New Update

Asia Cup: చిన్న జట్టే కానీ గట్టి పోటీ ఇవ్వడంలో దిట్టగా ముందుంటుంది అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు. పెద్ద జట్లకు ఎన్నో సార్లు షాక్ ఇస్తూ మ్యాచులు గెల్చుకుంది. తాజాగా ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినంతా పని చేసింది. అయితే అంపైర్లు చేసిన పొరపాటుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముందు బ్యాటింగ్ చేసిన లంక జట్టు 291 పరుగులు చేసింది. అయితే సూపర్ 4కు అప్గాన్ టీం క్వాలిఫై కావాలంటే 37.1 ఓవర్లలో 292 పరుగులు చేయాలి. అలా కాకపోతే 38.4 ఓవర్లలో 295 పరుగులు చేస్తే మెరుగైన రన్‌రేట్‌తో క్వాలిఫై అయ్యేది. కానీ ఈ విషయం ఆ జట్టుకు తెలియకపోవడం గమనార్హం.

ఇదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన ఆ జట్టు హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్ తెలిపారు. మ్యాచ్‌కు ముందు తమకు శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో మాత్రమే ఛేదించాలని చెప్పారన్నారు. అంతేకానీ రన్‌రేట్ సమీకరణాల దృష్ట్యా తాము 38.4ఓవర్లలో 295 పరుగులు చేస్తే సూపర్-4కు అర్హత సాధించే అవకాశం ఉందని ఎవరూ చెప్పలేదని వాపోయారు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొన్ని తప్పులు చేశామని.. వారిని తక్కువ పరుగులకే కట్టడి చేసి ఉంటే సమీకరణాలు మరోలాగా ఉండేవని ట్రాట్ వెల్లడించారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 92 పరుగుల వద్ద రనౌటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నారు. కరుణరత్నే 32, అసలంక 36, దునిత్ 33 పరుగులతో రాణించారు. 292 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన అప్గాన్‌ జట్టు.. ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన గుల్బాదిన్ (22) రెహ్మత్ షా (40), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (59), మహ్మద్ నబీ( 65) పరుగులతో ధాటిగా ఆడారు. దీంతో స్కోర్ బోర్డు వేగంగా పెరిగి లక్ష్యం తగ్గింది. చివర్లో కరీమ్ జనత్ (22), నజీబుల్లా జద్రాన్ ( 23) కూడా హిట్టింగ్ చేశారు.

అయితే చివర్లో 37 ఓవర్లు ముగిసేసరికి 289/8గా అఫ్గాన్ స్కోర్ చేసింది. అయితే ఒక బంతికి మూడు పరుగులు చేస్తే క్వాలిఫై అయ్యేది. క్రీజులో రషీద్ ఖాన్(27) ఉండటంతో అప్గాన్ గెలుపు ఖాయంగా ఉంది. అయితే తొలి బంతికే ముజీబ్ ఔట్ అవ్వడంతో అప్గాన్ ప్లేయర్లు నిరాశలో మునిగిపోతే.. లంకేయులు సంబరాలు జరపుకున్నారు. అయితే మరో 3 బంతుల్లో 6 పరుగులు చేసి ఉంటే కచ్చితంగా క్వాలిఫై అయ్యేది. కానీ అప్పటికే నిరాశలో ఉన్న ప్లేయర్లు మరో రెండు బంతులను వృథా చేసి ఔటయ్యారు. ఈ విషయం ముందే తెలిసి ఉంటే రషీద్ ఖాన్ కచ్చితంగా హిట్టింగ్ చేసి మ్యాచ్ గెలిపించేవాడని అభిమానులు చెబుతున్నారు. కీలక మ్యాచులో నిర్లక్ష్యంగా వహించిన అంపైర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: సూపర్-4 వేదికల్లో మార్పుపై క్లారిటీ.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి