Kurnool: లారీ ఎక్కిన విమానం.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

నేటి బిజీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. నలుగురిలో స్పెషల్‌గా ఏమైనా చేయాలి. అప్పుడే జీవింతో విజయవంతం అవుతాం. ఈ సూత్రం ముఖ్యంగా వ్యాపారంలో బాగా వర్తిస్తుంది. ఫుడ్ బిజినెస్‌లో అయితే కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం రెస్టారెంట్ నిర్వాహకులు అందరికంటే వినూత్నంగా ఆలోచించారు.

Kurnool: లారీ ఎక్కిన విమానం.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
New Update

నేటి బిజీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. నలుగురిలో స్పెషల్‌గా ఏమైనా చేయాలి. అప్పుడే జీవింతో విజయవంతం అవుతాం. ఈ సూత్రం ముఖ్యంగా వ్యాపారంలో బాగా వర్తిస్తుంది. ఫుడ్ బిజినెస్‌లో అయితే కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. అప్పుడే కస్టమర్స్ మన వైపు వస్తారు. ఇప్పటికే సొసైటీలో వెరైటీ థీమ్స్‌తో రెస్టారెంట్లను పెడుతూ సక్సెస్ అవుతున్నారు. జైల్, రైల్, బస్ థీమ్‌లతో ఇప్పటికే ఎన్నో రెస్టారెంట్లు నడుస్తున్నాయి. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం రెస్టారెంట్ నిర్వాహకులు అందరికంటే వినూత్నంగా ఆలోచించారు.

ఏకంగా విమానం థీమ్‌తో కర్నూలు సిటీ ఆన్ వింగ్స్ బై మార్స్ అనే రెస్టారెంట్ రన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఎయిర్ బస్ 320 కి చెందిన విమానాన్ని కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కర్నూలుకు లారీలో తీసుకువచ్చారు. ఈ విమానం జిల్లాలోని కల్లూరు మండలం దుపాడుకు చేరుకోవడానికి 15 రోజుల సమయం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు. విమాన ప్రయాణం చేయలేని సామాన్యులు సైతం ఇందులో కూర్చుని విమానంలో భోజనం చేసిన అనుభూతి పొందవచ్చని అంటున్నారు.

ఈ విమానాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు విమానం రోడ్డెక్కింది అంటూ ఆశ్చర్యంగా దాంతో సెల్ఫీలు దిగారు. ఇప్పటికే విమానం కాన్సెప్ట్‌తో జనాల దృష్టిని ఆకర్షించిన ఈ రెస్టారెంట్.. నిర్వాహకులకు ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి. విమానంలో హోటల్‌కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతున్నారు. మీకు కూడా విమానంలో భోజనం తిన్న ఫీలింగ్ కలగాలంటే కర్నూలు వెళ్లాల్సిందే. త్వరలోనే హైదరాబాద్ లో కూడా విమానం హోటల్ ప్రారంభం కానుంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe