Emily Willis: డోస్ ఎక్కువై కోమాలోకి వెళ్లిన పోర్న్ స్టార్.. సోషల్ మీడియాలో సోదరుడి ప్రచారం!

మాజీ పోర్న్ స్టార్ ఎమిలీ విల్లీస్ కోమాలోకి వెళ్లింది. ఇటీవల గుండెపోటుకు గురైన 25ఏళ్ల యువతి వెంటిలేటర్ పై ఉన్నట్లు సమాచారం. ఆమె వైద్య ఖర్చులకోసం తన సోదరుడు 'GoFundMe' ప్రచారం మొదలుపెట్టాడు. శృంగారం కోసం ఓవర్ డోస్ మెడిసిన్ వాడిందనే వాదనలను ఎమిలీ తండ్రి ఖండించారు.

New Update
Emily Willis: డోస్ ఎక్కువై కోమాలోకి వెళ్లిన పోర్న్ స్టార్.. సోషల్ మీడియాలో సోదరుడి ప్రచారం!

Emily Willis in Coma After Cardiac Arrest: ఇటీవలే గుండెపోటుకు గురైన మాజీ అడల్ట్ స్టార్ ఎమిలీ విల్లీస్.. కోమాలోకి వెళ్లింది. 25 ఏళ్ల నటి అడల్ట్ ఫిల్మ్ లో భాగంగా ఓవర్ డోస్ మాత్రలు తీసుకున్నందుకు ఇలా జరిగిందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్ తో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

తప్పుడు ప్రచారం..
అయితే దీనిపై స్పందించిన ఆమె తండ్రి మైఖేల్ విల్లిస్.. ఎమిలీ (Emily Willis) ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారం చేయొద్దంటూ నెటిజన్లను హెచ్చరించారు. ఎమిలీ టాక్సికాలజీ పరీక్షలు ప్రతికూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అధిక మోతాదులో మద్యం, డ్రగ్స్, పోర్న్ కు సంబంధించిన మెడిసిన్ వాడటం వల్లే ఆమె గుండె ఆగిపోవడానికి కారణమైందనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. 'ఎమిలీ విల్లీస్ గుండెపోటుకు ముందు ఎనిమిది రోజులు పునరావాసంలో గడిపారు. మాదకద్రవ్య దుర్వినియోగాన్ని అధిగమించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు కట్టుబడి ఉంది' అని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tomb: పనామాలో బయటపడ్డ 1200 ఏళ్ల నాటి సమాది.. భారీ బంగారు నిధి!

'GoFundMe'..
ఇక ఎమిలీ సోదరుడు తన వైద్య ఖర్చులకోసం 'GoFundMe' ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పటికీ కావాల్సిన మొత్తంలో కొంత మేర డబ్బులు సమకూరాయని, దీంతో ఎమిలీకీ అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఎమిలీ రెండు సంవత్సరాల క్రితమే అడల్ట్ ఫిల్మ్స్ నుంచి తప్పుకుందని, ప్రస్తుతం ఇతర రంగాలను అన్వేషిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఆమె కోసం విరాళాలలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఎమిలీ కోలుకోవడానికి మరిన్ని నిధులు సేకరించేందుకు తమ మద్ధతు ఉంటుందని అభిమానులు హామీ ఇవ్వడంపై ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఎమిలీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు