/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Aditya-L1-1-jpg.webp)
ISRO-Aditya L1: సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్1’ తన ప్రయాణంలో తుది అంకానికి సమీపించింది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఓ ఎన్జీఓ నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆదిత్య ఎల్1 జనవరి 6వ తేదీన ఎల్1(లగ్రాంజ్ పాయింట్-1) పాయింట్‌లోకి ప్రవేశిస్తుందని మేం అంచనా వేస్తున్నామని, దీనికి సంబంధించిన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామన్నారు.
ISRO releases
Respond Basket 2023and solicits proposals by
January 31, 2024.Details:https://t.co/divKxtLghp pic.twitter.com/md9jksi263
— ISRO (@isro) December 23, 2023
ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎల్1 పాయింట్‌కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్‌ను మండిస్తామని, తర్వాత ఈ వ్యోమనౌక ఎల్1 కేంద్రంలో స్థిరపడుతుంది. అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్ష్యలో తిరుగుతూ ఉంటుందని తెలిపారు. ఐదేళ్లపాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుందని, సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. అలాగే భారత స్పేస్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఇస్రో ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు.
Also Read:
సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!