Aditya-L1 Sun Mission update: భూమి గురుత్వాకర్షణ పరిధిని పరిధిని దాటేసిన ఆదిత్య ఎల్-1.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో.. ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న ఈ ఉపగ్రహం భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ప్రకటించింది. By Shiva.K 30 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Aditya-L1 Sun Mission updates: ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న ఈ ఉపగ్రహం భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ప్రకటించింది. ఆదిత్య ఎల్-1 సూర్యుడు-భూమి మధ్యలో లాగ్రాంజ్ పాయింట్ 1(ఎల్1)వైపు తన మార్గంలో ప్రయాణిస్తోందని ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగంలో ఇది కీలక మైలురాయి అని పేర్కొంది ఇస్రో. అయితే, భూ గురుత్వాకర్షణ శక్తికి అవతల అంతరిక్ష నౌకను పంపడం ఇది వరుసగా రెండవసారి. మొదటిసారి మార్స్ ఆర్బిటల్ మిషన్‌లో ఈ ప్రయోగం చేశారు. 'ఆదిత్య-L1 మిషన్ అంతరిక్ష నౌక భూమి నుండి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం దాటి ప్రయాణించి, భూమి గురుత్వాకర్షణ శక్తిని విజయవంతంగా దాటింది. సూర్యుడు-భూమి లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) వైపు విజయవంతంగా దూసుకెళ్తుంది. ఇస్రో ఒక అంతరక్షి నౌకను భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి పంపడం ఇది రెండవసారి. మొదటిసారి మార్స్ ఆర్బిటర్ మిషన్ ద్వారా ఈ ప్రయోగం చేయడం జరిగింది.' అని ఇస్త్రో అధికారిక ట్వి్ట్టర్ హ్యాండిల్‌లో పేర్కొనడం జరిగింది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ తరువాత.. సూర్యడిపై పరిశోధనలు చేపట్టింది ఇస్రో.. ఇందులో భాగంగా.. సెప్టెంబర్ 2వ తేదీన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదిత్య ఎల్1 మిషన్‌ను ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహక నౌక ద్వారా ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది ఇస్రో. ఈ ఉపగ్రహంలో మొత్తం ఏడు పెలోడ్స్ ఉన్నాయి. ఈ ఉపగ్రహం 'లెగ్రేంజ్ పాయింట్ 1' వద్దకు చేరుకుంటుంది. ఇది భూమి నుంచి సూర్యడి దిశగా 15 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటి వరకు 9.2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య ఎల్1 ఇంకా 5.8 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ భూమి, సూర్యడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఇక్కడి పరిస్థితులు ఉపగ్రహాలకు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇస్రో ఈ పాయింట్‌ను ఎంచుకుని ప్రయోగం చేపట్టింది. ఈ ప్లేస్ నుంచే సూర్యడిని పరిశీలిస్తుంటుంది. ఇక్కడ ఉపగ్రహం హాలో కక్షలో ఉంటుంది. ఈ కక్ష్యలు త్రిమితీయ, కాలానుగుణంగా ఉంటాయి. ఈ పాయింట్ నుంచి ఆదిత్య ఎల్1 నిత్యం సూర్యుడిని పరిశీలిస్తూ.. భూమి వైపు దూసుకొచ్చే ప్రమాదకరమైన అంశాలను ముందే గుర్తించి హెచ్చరికలు పంపుతుంది. తద్వారా అంతరిక్షంలోని విలువైన శాటిలైట్స్, భూ ఆధారిత మౌలిక సదుపాయాలను కాపాడుకునే వీలుంటుంది. ఆగా, ఆదిత్య ఎల్1 జనవరి 6, 2024 నాటికి తన గమ్య స్థానాన్ని చేరుకుంటుంది. Aditya-L1 Mission: 🔸The spacecraft has travelled beyond a distance of 9.2 lakh kilometres from Earth, successfully escaping the sphere of Earth's influence. It is now navigating its path towards the Sun-Earth Lagrange Point 1 (L1). 🔸This is the second time in succession that… — ISRO (@isro) September 30, 2023 Also Read: Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్ #isro #aditya-l1-sun-mission-updates #aditya-l1-sun-mission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి