TCongress Politics: రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారా..? RTVతో అద్దంకి దయాకర్ ఏమన్నారంటే..?

ప్రస్తుతం బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయని చెప్పారు అద్దంకి దయాకర్‌. ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. అలాంటి భాష మాట్లాడడం తప్పేనని..అయితే భావం విషయంలో మాత్రం కరెక్ట్‌గానే ఉన్నానన్నారు.

New Update
TCongress Politics: రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారా..? RTVతో అద్దంకి దయాకర్ ఏమన్నారంటే..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు..ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు, బహిరంగా సభలతో నిన్నమొన్నటివరకు సందడిసందడిగా కనిపించిన హస్తం పార్టీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో కాస్త డిఫెన్స్‌లో పడినట్టే కనిపిస్తోంది. రైతులకు 24గంటలు ఉచిత కరెంట్ అవసరంలేదని.. 8గంటలు చాలని చెప్పిన రేవంత్‌ వ్యాఖ్యలను కొందరు సీనియర్లు తప్పుపడుతుండగా..మరికొందరు సమర్థిస్తున్నారు. రేవంత్‌ ఏ సందర్భంలో అలా అన్నారో తెలియకుండా కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నది మరికొందరి వాదన. మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అద్దంకి దయాకర్ ఈ విషయంపై ఎలా స్పందించారు..? కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారా అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పారు..? ఆర్టీవీ(RTV)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అద్దంకి ఏం మాట్లాడారో చూడండి..!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏమన్నారంటే..?
ఉచిత విద్యుత్‌ విషయంలో రేవంత్‌ వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్‌ని ఆర్టీవీ ప్రశ్నించగా.. అది కేవలం ఓపినియన్‌ పాయింట్ ఆఫ్‌ వ్యూలో చూడాలని కానీ..పార్టీ నిర్ణయంగా చూడకూడదని రిప్లై ఇచ్చారు. దోచుకున్నోడే ఇంత చేస్తే మేం మంచి చేసేటోళ్లమని..మేమెంత ఇవ్వాలని పరోక్షంగా కేసీఆర్‌కి చురకలంటించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఇస్తున్న కరెంట్‌ని మేం అధికారంలోకి వస్తే 14వేల కోట్లకే ఇస్తామన్నారు అద్దంకి. పీపీఏ(PPA)లను ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేస్తలేదని ప్రశ్నించారు. ధరలు తగ్గినా పాత రేట్లకే కరెంట్‌ని ఎందుకు కొంటున్నారో అర్థంకావడలేదన్నారు. ఈ విషయంపై ఓపెన్‌ డిస్కషన్‌కి తాను రెడీగా ఉన్నానని..ఎవరూ వస్తారో రమ్మని చెప్పండన్నారు అద్దంకి. కేసీఆర్‌ వస్తరా, కేటీఆర్‌ వస్తరా అన్నది వాళ్ల ఇష్టమన్నారు.

అద్దంకి దయాకర్‌కి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సయోధ్య ఉందా..?
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై గతంలో అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే *** అంటూ ఓ సభలో బూతు డైలాగ్‌ వేశారు. ఇది అప్పట్లో చాలా రచ్చకు దారితీసింది. దయాకర్‌ తరఫున రేవంత్‌రెడ్డి క్షమాపణాలు చెప్పినా వెంకట్‌రెడ్డి ససేమిరా అన్నారు. దయాకర్‌ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. చివరకు అద్దంకి దయాకర్‌ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఆ పరిణామాలపై ఆర్టీవీ ప్రశ్నించగా..తాను మాట్లాడిన భాష తప్పేనని..అందుకే సారీ చెప్పానని.. కానీ భావం మాత్రం కరెక్టేనని చెప్పారు అద్దంకి దయాకర్‌.

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారా..?
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పార్టీ కోసం పని కలిసి పని చేస్తానని చెప్పిన అద్దంకిని.. ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారా అని ఆర్టీవీ ప్రశ్నించింది. నిజానికి గతంలో కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి తర్వాత బీజేపీలో చేరారు. ఏరికోరి మరి ఉప ఎన్నిక తెప్పించుకున్నారు. చివరకు మునుగోడు బైపోల్స్‌లో ఓడిపోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన అద్దంకి దయాకర్‌.. రాజగోపాల్‌రెడ్డి పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. రావాలని కోరుకుంటున్నామన్నారు. బీజేపీలో చేరిన తర్వాత రాజగోపాల్‌రెడ్డికి ఓటమి తప్ప ఏమీ మిగలలేదని..హస్తంపార్టీ ఆయనకు గెలిపిస్తే..కమలం పార్టీ ఆయన్ను ఓడించిందన్నారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి హస్తం కండువా కప్పుకుంటారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఇటివలి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటితో ఆయన ఇప్పటికే భేటి కూడా అయ్యారు. తాజాగా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అద్దంకి రాజగోపాల్‌రెడ్డి వస్తారంటూ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు