నేను మీకేం అన్యాయం చేశా?..నటి సురేఖావాణి కూతురు ఎమోషనల్..! పొలిటికల్ ట్రోల్స్ గురించి ఎమోషనల్ అయ్యారు నటి సురేఖావాణి కూతురు సుప్రీత. "నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను మీకేం అన్యాయం చేశా? మీ ట్రోలింగ్ నా మానసిక ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపిస్తోందో తెలుసా?" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. By Jyoshna Sappogula 05 Dec 2023 in సినిమా New Update షేర్ చేయండి Supritha: టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత( Supritha ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటారు. కూతురితో సమానంగా రీల్స్ చేస్తూ సురేఖావాణి కూడా నెట్టింట హంగామా చేస్తూ ఉంటుంది. అంతేకాదు, గతంలో షేర్ చేసిన వీడియోల కారణంగా తల్లీకూతుళ్లిద్దరూ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కాగా, ఎన్నికలకు మునుపు సురేఖావాణి, సుప్రీత.. బీఆర్ఎస్ గెలవాలని కారు ముందు నిలబడి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని నెటిజన్లు రెచ్చిపోయి ట్రోల్ చేస్తుండటంతో ఆవేదన చెందిన సుప్రీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను తొలుత బీఆర్ఎస్‌కు సపోర్టు చేశా. మునుపటి ఇన్‌స్టా స్టోరీలో కొత్త సీఎంకు శుభాకాంక్షలు చెప్పా. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్ చేయడం అనవసరం. నేను మీకేం అన్యాయం చేశా? నాపై ఎందుకింత ద్వేషం? మీ ట్రోలింగ్ నా మానసిక ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపిస్తోందో తెలుసా?’’ అంటూ సుప్రీత పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇక, సురేఖావాణికి( Surekhavani ) గతంతో పోలిస్తే మూవీ ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. సురేఖావాణి రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది. కానీ, వయస్సు పెరుగుతున్నా.. సురేఖావాణి యంగ్ గానే కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. Also Read: ఈ వయసులో హనీమూన్ ఏంట్రా బాబు.! #tolly-wood-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి