/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-15T183534.578-jpg.webp)
Director Surya Kiran: ప్రముఖ దర్శకుడు, నటి కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ మార్చి 11న మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సూర్య కిరణ్ మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు త్రీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Also Read: Mamitha Baiju: నయా క్రష్.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?
అన్నయ్య మృతి పై సుజిత ఎమోషనల్ పోస్ట్
అయితే తాజాగా సూర్య కిరణ్ మృతి పై ఆయన సోదరి నటి సుజిత చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. సుజిత తన అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైయ్యారు. "ఆయన నా సోదరుడు మాత్రమే కాదు, నా తండ్రి, నా హీరో. నాకెంతో ఇష్టమైన వ్యక్తి మా మధ్య లేరు. ఇండస్ట్రీలో అన్నయ్య ప్రతిభకు నేనెప్పుడూ అభిమానినే. పునర్జన్మ నిజమైతే.. నీవు కోరుకున్న కలలు, ఆశయాలు సాకారం కావాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సుజిత."
సూర్య కిరణ్ కు ఆయన సోదరి సుజిత అంటే చాలా ఇష్టం. సుజితకు కూడా అన్నయ్య అంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్నీ వారిద్దరూ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటిది నేడు తన అన్నయ్య సూర్య కిరణ్ లేరనే నిజాన్ని తట్టుకోలేకపోయిన సుజిత కనీళ్ళు పెట్టుకున్నారు. పసివాడు ప్రాణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సుజిత..ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళ్ లో గౌరీ అనే సీరియల్ చేస్తోంది.
View this post on Instagram
Also Read: Surekha Vani: ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి