Sreeleela : ఆ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. షాక్ లో ఫ్యాన్స్?

కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్దార్ 2'. ఈ సినిమాలో లో రెండో కథానాయిక పాత్ర కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకపోవడమే దీనికి కారణం అని టాక్ వినిపిస్తుంది.

Sreeleela : ఆ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. షాక్ లో ఫ్యాన్స్?
New Update

Actress Sreelela : తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీలకు గత ఏడాది వరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీకి ప్రెజెంట్ పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. అయితే ఇటీవలే ఈ హీరోయిన్ కు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట. కానీ ఆ ఆఫర్‌ని శ్రీలీల తిరస్కరించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా నటిస్తున్న 'సర్దార్ 2' సినిమాలో లో రెండో కథానాయిక పాత్ర కోసం శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించడం పరిశ్రమలో సంచలనం సృష్టించింది. శ్రీలీల తన నిర్ణయానికి కారణాలను ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కథలో ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్లే ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా ఇలాంటి ఓ బడా ప్రాజెక్ట్ లో యాక్ట్ చేసే ఛాన్స్ ను శ్రీలీలరిజెక్ట్ చేయడం తెలిసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Also Read : వామ్మో.. రణ్ బీర్ – ఆలియా మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

శ్రీలీల ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో 'సర్దార్ 2' చిత్రబృందం ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా కార్తీ నటించిన 'సర్దార్' సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సర్దార్‌లో కార్తీ డ్యూయల్ రోల్ చేశాడు. ఒకటి స్పై ఏజెంట్, మరొకటి పోలీస్ ఆఫీసర్. ఈ సినిమాలో కూడా అలాంటి రకరకాల పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది. పీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

#sardar-2-movie #actress-sreelela
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe