Pranita Subhash : రెండో సారి తల్లి కాబోతున్న 'పవన్' హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలు!

హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ లో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ..‘రౌండ్ 2.. ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవు’ అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

New Update
Pranita Subhash : రెండో సారి తల్లి కాబోతున్న 'పవన్' హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలు!

Actress Pranita Subhash : 'అత్తారింటికి దారేది' మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన హీరోయిన్ ప్రణీత సుభాష్.. మరోసారి తల్లి కాబోతున్నారు. ఇప్పటికే ఒక అమ్మాయికి తల్లి అయిన ప్రణీత.. తాజాగా తన రెండో ప్రేగ్నెన్సీ గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు పలు ఫోటోలు షేర్ చేశారు. ప్రణీత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అందమైన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అందరితో పంచుకున్నారు.

‘రౌండ్ 2.. ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవు’ అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.. కాగా ప్రణీత ప్రేగ్నెన్సీ వార్త తెలియగానే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రణీత సుభాష్ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 'ఏం పిల్లో..ఏం పిల్లడో' అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

Also Read : ఎట్టకేలకు బాలయ్యతో సినిమా చేయనున్న దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరంటే?

ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజ్ ను పెళ్లి చేసుకుంది. 2022లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.



Advertisment
తాజా కథనాలు