/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-06T184736.857-1-jpg.webp)
Samantha - Preetham Jukalker Visits Tirumala: టాలీవుడ్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ చిత్రాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సమంత అటు బాలీవుడ్, టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గత కొద్దికాలంగా మాయోసైటిస్ తో బాధపడుతున్న సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆమె చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఆరోగ్యం పైనే పెట్టింది సామ్. ఈ క్రమంలో పుణ్య క్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు, మానసిక ఆరోగ్యం పై కూడా శ్రద్ధ తీసుకుంటోంది.
Also Read: Actress Vijayalakshmi: నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను .. నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో..!
అయితే తాజాగా సమంత మార్చి 4న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అక్కడ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్నిఆలయాన్ని సందర్శించుకొని.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని వేదాశీర్వచనాలు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది ఇలా ఉంటే తిరుమలలో సమంతతో పాటు ఆమె స్టైలిస్ట్, స్నేహితుడు ప్రీతమ్ జుకల్కర్ కూడా కనిపించడంతో అందరి ద్రుష్టి అతడి పై పడింది.
సమంత - ప్రీతమ్ జుకల్కర్
అయితే గతంలో సమంత, నాగ చైతన్య విడాకుల సమయంలో ప్రీతమ్ జుకల్కర్ పేరు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే. అతడి కారణంగానే సమంత వివాహ జీవితంలో కలహాలు, విబేధాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ వాటిని ఖండించారు ప్రీతమ్. సమంత, తాను కేవలం స్నేహితులము మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తిరుమలలో నేరుగా సమంతతో కనిపించేసరికి సోషల్ మీడియాలో మరోసారి గుసగుసలు మొదలయ్యాయి. సామ్ తనతో పాటు అతడిని తీసుకువెళ్ళడానికి వెనుక కారణం ఏంటీ..? వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి మించిన రిలేషన్ ఏదైనా ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు నెటిజన్లు.
#Samantha in Tirumala Tirupati Devasthanam! 🥹♥️🧿#Samantha #SamanthaRuthPrabhu #SamFanClub #TeamSamantha pic.twitter.com/9zI8EkTMio
— 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) March 4, 2024
Also Read: Multi Starrer Movie: వావ్..! మరో క్రేజీ కాంబో.. మల్టీ స్టారర్ కు సిద్దమైన యంగ్ హీరోస