Actress Sai Pallavi : పదేళ్లుగా అతనితో ప్రేమలో ఉన్నా.. సంచలన విషయం బయటపెట్టిన సాయి పల్లవి

హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మీరు ప్రేమలో పడలేదా? అని అడగ్గా..' మహాభారత ఇతిహాసం నాకు చాలా ఇష్టం. అందులో అభిమన్యుడి పాత్రను ఎంతగానో ప్రేమిస్తున్నా. గత పదేళ్లుగా ఆయన ప్రేమలో ఉన్నా' అని పేర్కొంది.

New Update
sai pallavi

Actress Sai Pallavi :  సౌత్ సినీ ఇండస్ట్రీలో గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ హోమ్లీ క్యారెక్టర్స్‌ తో హీరోయిన్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన 'తండేల్' సినిమా చేస్తున్న సాయిపల్లవి, బాలీవుడ్లో రామాయణ తోపాటు తమిళంలో ఓ మూవీలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇప్పటివరకు మీరు ప్రేమలోనే పడలేదా? అని అడగ్గా.. అందుకు సాయి పల్లవి బదులిస్తూ.." మహాభారత ఇతిహాసం తనకు చాలా ఇష్టం. అందులో అభిమన్యుడి పాత్రను నేను ఎంతగానో ప్రేమిస్తున్నా. గత పదిహేడేండ్లుగా అభిమన్యుడి పాత్ర గురించి ఏదో కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నా.

Also Read : కంగనా రనౌత్ కు బిగ్ షాక్.. ఆ సినిమాపై కోర్టులో కేసు

ఆయనకు సంబంధించిన ఏ కథ అయినా నాలో ఆసక్తిని పెంచుతుంది. ఓ రకంగా చెప్పాలంటే గత పదేళ్లుగా ఆయన ప్రేమలో ఉన్నా" అంటూ నవ్వుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది. దీంతో ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు