Actress Sai Pallavi : సినీ ఇండస్ట్రీలో కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. కమర్షియల్ సినిమాల జోలికి అస్సలు వెళ్ళదు. సినిమా లో హీరోయిన్ పాత్ర అంటే.. సాయిపల్లవి ప్రాధాన్యతలు వేరు. ఆమె అనుకున్న ప్రాధాన్యతల మేరకే సినిమా ఒప్పుకుంటుంది. అలా లేకపోతే.. ఎంత పెద్ద బేనర్ అయినా, ఎంత టాప్ డైరెక్టర్ అయినా, టాప్ హీరో అయినా సింపుల్ గా నో అనేస్తుంది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఏమైనా ప్రత్యేక ప్రణాళికలున్నాయా అనే ప్రశ్న సాయి పల్లవికి ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ.." కళాత్మక సినిమాలు.. వాణిజ్య చిత్రాలు అని కథల్ని వర్గీకరించడం నాకు నచ్చదు. సినీప్రియులకు ఏది నచ్చుతుందో.. ఏది నచ్చదో ముందే చెప్పలేం కాబట్టి ఏది చేసినా పది కాలాలు గుర్తుండిపోయేలా ఉండాలని అనుకుంటా.
Also Read : అంబానీ పెళ్లికి నన్ను ఫోన్ చేసి మరీ పిలిచినా వెళ్ళలేదు.. ఎందుకంటే : కంగనా రనౌత్
నిజానికి బరువైన పాత్రలు చేయడం అంత తేలికేం కాదు. లోలోపల చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఈ సారి సరదాగా సాగిపోయే తేలికైన పాత్రలు చేయాలనిపిస్తుంది. కాకపోతే వాణిజ్య ప్రధానమైన సినిమా చేసినా కాస్త కొత్తదనమున్న పాత్రే చేయాలనుకుంటా. లేదంటే నటిగా నాకే కాదు.. చూసే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. మంచి కథలు దొరికితే పూర్తి స్థాయి కామెడీ, యాక్షన్ పాత్రలు చేయాలని ఉంది" అంటూ తెలిపింది.