Sai Pallavi: చెల్లి ఎంగేజ్ మెంట్ వేడుకల్లో సాయి పల్లవి.. మాస్ డాన్స్

నటి సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను కన్నన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వేడుకల్లో సాయి పల్లవి ఫ్యామిలీతో కలిసి డాన్స్ వేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

New Update
Sai Pallavi: చెల్లి ఎంగేజ్ మెంట్ వేడుకల్లో సాయి పల్లవి.. మాస్ డాన్స్

Sai Pallavi: తెలుగు ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. పాత్రకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎల్లప్పుడూ సాంప్రదాయ వస్త్రాలంకారణలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే సాయి పల్లవికి అచ్చం తన లాగే కనిపించే ఒక చెల్లి కూడా ఉన్నారు. ఈమె కూడా కోలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్ తన కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేస్తూ.. త్వరలోనే ఎంగేజ్ మెంట్ అంటూ ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Animal Movie: డిలీట్ చేసిన రష్మిక సీన్స్‌ను కూడా చూడవచ్చు.. యానిమల్‌ ఓటీటీ డేట్‌ ఫిక్స్!

చెల్లి ఎంగేజ్ మెంట్ లో సాయి పల్లవి డాన్స్

అయితే తాజాగా పూజ కన్నన్ నిశ్చితార్థం వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. పూజ వినీత్ అనే వ్యక్తిని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. పూజ తన ఎంగేజ్ మెంట్ ఫొటోస్ షేర్ చేయగా.. అందులో నటి సాయి పల్లవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే చెల్లి ఎంగేజ్ మెంట్ వేడుకల్లో సాయి పల్లవి ఫ్యామిలీతో కలిసి డాన్స్ వేస్తూ సందడి చేసింది. సింపుల్ గా ఎల్లో కలర్ సారీలో తన చెల్లితో కలిసి స్టెప్పులు వేశారు. ఇది చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తన బ్రదర్ పెళ్ళిలో కూడా ఇలాగే డాన్స్ వేస్తూ కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

publive-image

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు