Raadhika: రోజాకు నేనున్నా..బండారుపై విరుచుకుపడిన నటి రాధిక..!! మంత్రి రోజాకు ప్రముఖ సినీనటి రాధిక అండగా నిలిచారు. రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో రోజాకు నటి రాధిక అండగా నిలుస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. By Jyoshna Sappogula 07 Oct 2023 in సినిమా రాజకీయాలు New Update షేర్ చేయండి Raadhika: మంత్రి రోజాకు ప్రముఖ సినీనటి రాధిక అండగా నిలిచారు. రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో రోజాకు నటి రాధిక అండగా నిలుస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. I condemn below the belt hitting , labelling women, objectifying and being unparliamentary, an ex minister #bandarasatyanarayana has no qualms with his language and attitude. I stand for minister /actor amd good friend @RojaSelvamaniRK #women #harassment #politics pic.twitter.com/nmGHyeLgi2 — Radikaa Sarathkumar (@realradikaa) October 6, 2023 ఓ స్నేహితురాలిగా, సహనటిగా మంత్రి రోజాకు ఆమె అండగా ఉంటానని తెలిపారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను విపరీతంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలంటూ విచారం వ్యక్తం చేశారు. వాటిని చూసి తనకు ఆగ్రహం కూడా కలుగుతోందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటు బిల్లు కూడా పాస్ చేసిందని, దేశం పురోగతి దిశగా ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారని, మనందరం సమైక్యంగా ఉంటూ దేశాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఓ గౌరవనీయ వ్యక్తి నుంచి, పార్టీ నుంచి ఇలాంటి కామెంట్లు రావడం చాలా అవమానకరమన్నారు. భారత్‌ను మాతగా పిలుచుకుంటామని, అలాంటిది మహిళలను ఇలాగా గౌరవించేది అంటూ మండిపడ్డారు. ఇది రాజకీయాలకే అవమానకరమన్నారు. ఒక మహిళను ఎదుర్కోవడం ఇలానేనా? అని ప్రశ్నించారు. అలా మాట్లాడితే మహిళలు భయపడతారనుకుంటే అది చాలా తప్పని అన్నారు. మీరు రాజకీయాల కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతోందో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. కాబట్టి అలా అందరినీ ఒకే గాటన కట్టి మాట్లాడొద్దని హితవు పలికారు. ఇలాంటి మాటలతో హింసించాలనుకోవడం సరికాదని, దీనివల్ల మీరు పొందే ప్రయోజనం ఏంటని బండారు సత్యనారాయణను నిలదీశారు. ఇది మీకు సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఓ గొప్ప పార్టీని, ఓ గొప్ప బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోడానికి లేదని, తాను రోజాకు, మహిళలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని రాధిక ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. సినీ హీరోయిన్లు ఆమెకు అండగా నిలుస్తు.. బండారు సత్యానారాయణపై విరుచుకుపడుతున్నారు. మంత్రి రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా మంత్రి రోజా చేసే పోరాటంలో ఆమెకు తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే నటి కుష్బూ తో పాటు పలువురు ప్రముఖ హీరోయిన్లు రియాక్ట్ అవుతున్నారు. Also Read: రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..? #ap-politics #ap-minister-roja #bandaru-satya-narayana #raadhika మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి