/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-13.jpg)
Actress Priyanka Mohan : నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న హైలీ ఎంటర్టైనర్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 29 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. అందరి తరుపున ఎస్ జే సూర్యను తాను ఓ ప్రశ్న అడుగుతున్నానని చెప్పారు. 'మేం ఖుషి 2 సినిమాని ఆశించవచ్చా'.. 'ఖుషి 2 చేస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కల్యాణ్‌తోనే చేయాలి'. దీనిపై స్పందించాలని కోరింది. దీనికి ఎస్ జే సూర్య మాత్రం నవ్వి ఊరుకున్నారు.
Also Read : ఈ పాప తల్లి ఎవరు? కరణ్ జోహార్ పిల్లలపై నెటిజన్ కామెంట్.. ఫైర్ అయిన నిర్మాత
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్ మేము కూడా ఖుషి 2 కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో `ఖుషి` మూవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్‌సేషన్ ను క్రియేట్ చేసి క్లాసిక్ మూవీగా నిలిచింది.