Nivetha Thomas: పెళ్ళికి రెడీ అయిన నాని హీరోయిన్.. వైరల్ అవుతున్న పోస్ట్!

హీరోయిన్ నివేదా థామస్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు ట్విటర్‌లో లవ్ సింబల్‌ను పోస్ట్‌ చేసింది.'కొంత కాలం గడిచింది.. కానీ,ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నివేద థామస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Nivetha Thomas: పెళ్ళికి రెడీ అయిన నాని హీరోయిన్.. వైరల్ అవుతున్న పోస్ట్!

Actress Nivetha Thomas Ready For Marriage : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న విషయం తెలిసిందే.రెండు రోజుల క్రితమే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ సైతం పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కేరళ బ్యూటీ నివేదా థామస్. ఈ హీరోయిన్ తాజాగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ద్వారా నివేద తాను పెళ్ళికి రెడీ అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది.

న్యాచురల్ స్టార్ నాని (Nani) సరసన జెంటిల్‌మేన్‌ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన నివేద థామస్.. నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, వకీల్ సాబ్ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Also Read : పదేళ్ల క్రితం ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించిన మూవీ ఏదో తెలుసా?

పోస్ట్ కు అర్థం అదేనా?

తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు ట్విటర్‌లో లవ్ సింబల్‌ను పోస్ట్‌ చేసింది. 'కొంత కాలం గడిచింది... కానీ..ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నివేద థామస్ సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె తన ట్వీట్ లో లవ్ సింబల్‌ ను జత చేయడాన్ని బట్టి చూస్తే ఇది నిజమే అని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే.. దీనిపై నివేద థామస్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు