Actress Megha Akash : ఎంగేజ్ మెంట్ చేసుకొని షాకిచ్చిన 'నితిన్' హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫొటోలు

టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ తన పెళ్లి వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకొని ఒక్కసారిగా షాకిచ్చింది. సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ శుభకార్యం జరిగినట్లు పేర్కొంది.

New Update
Actress Megha Akash : ఎంగేజ్ మెంట్ చేసుకొని షాకిచ్చిన 'నితిన్' హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫొటోలు

Actress Megha Akash: నితిన్ సరసన 'లై' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటూ తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంది. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో వివాహం చేసుకోనుందని అన్నారు. కానీ దీనిపై మేఘా ఆకాష్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ యంగ్ బ్యూటీ తన పెళ్లి వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకొని ఒక్కసారిగా షాకిచ్చింది.

Also Read : ‘ఇంద్ర’ రీ రిలీజ్.. థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన టీడీపీ ఎమ్మెల్యే, వీడియో వైరల్

సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ శుభకార్యం జరిగినట్లు చెప్పుకొచ్చింది. కాగా మేఘా ఆకాష్ కాబోయే భర్త ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు