Raj Tarun : రాజ్ తరుణ్ కు అంత సీన్ లేదన్న హీరోయిన్.. బిగ్ బాస్ ఎంట్రీపై కొత్త రచ్చ రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై హీరోయిన్ మనీషా షాకింగ్ కామెంట్స్ చేసింది. 'భలే ఉన్నాడే' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా చిట్ చాట్ లో..' రాజ్ తరుణ్ బిగ్‌బాస్‌కు వెళ్లే ఛాన్సేలేదు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు. ఇన్ని రోజులు హౌస్‌లో ఉండడం జరిగే పని కాదని' పేర్కొంది. By Anil Kumar 27 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Actor Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం 'భలే ఉన్నాడే'. ఈ చిత్రంలో మనీషా కంద్కూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ బ్యానర్స్ పై N.V. కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శివసాయివర్ధన్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. సెప్టెంబర్ 7 న మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై హీరోయిన్ మనీషా షాకింగ్ కామెంట్స్ చేసింది. 'భలే ఉన్నాడే' సినిమాలో అన్ని భావోద్వేగాలు ఉన్నాయని పేర్కొంది. ఇక రాజ్ తరుణ్ తో యాక్ట్ చేయడంపై మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ బెస్ట్ కోస్టార్. షూటింగ్ టైం లో మేమిద్దరం చాలా రిహార్సిల్స్ చేశాం అని తెలిపింది. Also Read : ఈ వారమే బిగ్ బాస్ సీజన్ – 8.. ఈసారి అన్నీ లైవ్ లోనే అనంతరం త్వరలోనే రాజ్ తరుణ్ బిగ్‌బాస్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అని అడిగితే..'ఛాన్సేలేదు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు. అన్ని రోజులు ఒకే హౌస్‌లో ఉండడం జరిగే పని కాదని' చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #raj-tarun-biggboss-entry #actor-raj-tarun మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి