Actress Hema: నేను రాలేను.. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా.! బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మ కొట్టింది. వైరల్ ఫివర్ తో బాధపడుతున్నట్లు సీసీబీకి లేఖ రాసింది. విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరింది. హేమ లేఖను పరిగణలోకి తీసుకోని సీసీబీ ఆమెకు మరో నోటీసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 May 2024 in సినిమా క్రైం New Update షేర్ చేయండి Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సీసీబీ విచారణకు నటి హేమ డుమ్మా కొట్టింది. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని విచారణకు రాలేనంటూ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు గడువు కోరుతూ లేఖ రాసింది. హేమ లేఖను పరిగణనలోకి తీసుకోని సీసీబీ.. హేమకు మరోసారి నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది. హేమ లేఖ.. బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను (Drugs) తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వారిలో టాలీవుడ్ కు చెందిన నటి హేమ కూడా ఉంది. ఈ రోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మంది విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని హేమ లేఖలో పేర్కొన్నారు. Also Read: కవిత కేసులో కీలక మలుపు.. బెయిల్‌పై ఉత్కంఠ..! సంబంధమే లేదు.. అయితే, ఈ రేవ్ పార్టీ వ్యవహారంలో మొదట్లో నటి హేమ ఉందని పోలీసులు స్పష్టం చేసినా.. ఆమె మాత్రం తనకు రేవ్ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదన్నట్టు చెబుతూ రెండు వీడియోలు రిలీజ్ చేసింది. అనంతరం, నార్కోటిక్ పోలీసులు హేమ బ్లడ్ సాంపుల్స్ ని కలెక్ట్ చేయగా.. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు గుర్తించారు. దీంతో హేమ బండారం అంతా బయట పడింది. బెంగుళూర్ రేవ్ పార్టీలో హేమ తన పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. టాలీవుడ్ లో చర్చ కృష్ణవేణి అనే పేరుతో ఈ పార్టీకి వెళ్లింది. తన పేరు ఎక్కడా బయటకి రాకుండా హేమ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీసులు ఆమె బండారం గుట్టు రట్టు చేశారు. అయితే, ఇప్పటివరకు రేవ్ పార్టీకి హాజరుకాలేదని చెప్పుకొచ్చిన హేమ ఇవాళ సీసీబీకి లేఖ రాయడమేంటని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. తాను వెళ్లకపోయినా తన పేరు బయటపెట్టి.. తనను బద్నామ్ చేశారని బెంగళూరు పోలీసులపై లీగల్ ఫైట్ చేస్తానన్నారు నటి హేమ. #actress-hema మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి