Vishwambhara: విశ్వంభర అప్డేట్.. మెగాస్టార్ సరసన నాగార్జున హీరోయిన్

మెగాస్టార్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా విశ్వంభర సెట్స్ లో మరో హీరోయిన్ అడుగుపెట్టినట్లు తెలిపారు మేకర్స్. నటి ఆషికా రంగనాథ్‌ చిరంజీవి సరసన కీలక పాత్రలో నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Vishwambhara: విశ్వంభర అప్డేట్..  మెగాస్టార్ సరసన నాగార్జున హీరోయిన్

Vishwambhara: బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.

విశ్వంభరలో ఆషిక ఎంట్రీ

publive-image

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో బ్యూటీ చిరంజీవి సరసన నటించేందుకు విశ్వంభర సెట్స్ లో అడుపెట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నటి ఆషిక రంగనాథ్ మెగాస్టార్ సరసన కనిపించబోతున్నట్లు తెలిపారు.

ఆషిక రంగనాథ్

ఆషిక రంగనాథ్ అమిగోస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా కింగ్ నాగార్జునతో 'నా సామి రంగ' చిత్రంలో మెరిసింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ తో జత కట్టేందుకు సిద్ధమైంది. మరి ఈ భామ విశ్వంభరలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా నెలకొంది.

Also Read: Rajinikanth: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం.. UAE గోల్డెన్‌ వీసా దక్కించుకున్న సూపర్ స్టార్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు