Vishal: ఆ అమ్మాయితో విశాల్ చెట్టాపట్టాల్.. కెమెరా చూసి పరుగో పరుగు.. వైరల్ వీడియో!

అచ్చం విశాల్‌ లాగే ఉన్న వ్యక్తి ఒక అమ్మాయితో న్యూయార్క్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి విశాలేనా? కాదా? లేకపోతే షూటింగ్‌లో భాగమా? ఒక వేళ విశాల్ అయితే ముఖం దాచుకొని ఎందుకు వెళ్తున్నరన్నది చర్చనీయాంశంగా మారింది.

Vishal: ఆ అమ్మాయితో విశాల్ చెట్టాపట్టాల్.. కెమెరా చూసి పరుగో పరుగు.. వైరల్ వీడియో!
New Update

Actor Vishal In NYC: నటుడు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విశాల్ సినిమాలకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో విశాల్ నటించిన పందెం కోడి, భరణి, పొగరు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విశాల్ నటుడిగా మాత్రమే కాదు నిర్మాతగా తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పై ఎన్నో సినిమాలను నిర్మించారు.

Also Read: Christmas Celebrations: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త.. క్రిస్మస్ వేడుకల్లో కనిపించిన క్లింకార.. ఫొటో వైరల్!

సినిమాలతో బిజీగా ఉండే విశాల్ ప్రస్తుతం నెట్టింట్లో చర్చగా మారారు. తమిళ మీడియాలో ఇతనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి తమిళ క్రిటిక్ రమేష్ బాల తన సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో న్యూ యార్క్ సిటీలో విశాల్ ముఖ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి.. అమ్మాయితో కలిసి రోడ్డు మీద నడుస్తున్నాడు. అయితే తమను కెమెరాతో రికార్డ్ చేస్తున్నారని తెలియగానే.. ఆ వ్యక్తి మొహం దాచుకొని పరుగెత్తడం కనిపించింది. అయితే న్యూయార్క్ సిటీలో ఉన్న ఈ వ్యక్తి విశాలేనా..? అని ప్రశ్నిస్తూ రమేష్ బాల తన ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోను చూసిన కొంత మంది నెటిజన్లు ఆ వ్యక్తి విశాల్ లానే ఉన్నారని అనగా.. మరి కొంత మంది ఇది షూటింగ్ ప్రమోషన్స్ కు సంబంధించిన వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఉన్నది నిజంగా హీరో విశాలేనా..? ఒక వేళ విశాల్ అయితే మొహం దాచుకొని ఎందుకు వెళ్తారు అనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.

Also Read: Salaar Collections Day 3: సలార్‌ కలెక్షన్ల ఊచకోత.. రూ. 400 కోట్లతో బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ ప్రకంపనలు!

#actor-vishal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి