తమిళనాడు డీఎండీఏ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ (vijaykanth )మరోసారి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు కోవిడ్ (COVID-19) సోకినట్లు తేలింది. శ్వాసకోశ సమస్యతో ఇటీవలే చికిత్స తీసుకున్న ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని పార్టీ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు గొంతునొప్పి కారణంగా విజయ్ కాంత్ వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు వెంటిలేటర్ పై శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని...వైద్యులు పూర్తి ఆక్సిజన్ తో ఇంటెన్సివ్ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందనే పుకార్లు కూడా వస్తున్నాయి.
ఈ క్రమంలోనే నవంబర్ 23న విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగైందని..వైద్యానికి సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత ఈనెల 11 న డిశ్చార్జీ చేశారు. డీఎండీకే వర్కింగ్ కమిటీ సాధారన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి చికిత్స కోసం విజయ్ కాంత్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయనకు కోవిడ్ సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: షుగర్ పేషంట్లకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం…ఎలా పొందాలి? పూర్తివివరాలివే..!!