Actor Siva Balaji : యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ.. అలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారంటూ

నటుడు, మా అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీ యూట్యూబర్ విజయ్‌ చంద్రహాసన్‌పై సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు క్రియేట్‌ చేస్తున్నాడని తెలిపారు.

Actor Siva Balaji : యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ.. అలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారంటూ
New Update

Actor Siva Balaji : ప్రముఖ నటుడు, మా అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీ ఓ యూట్యూబర్ పై కేసు పెట్టారు. పలువురు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్‌ ట్రోల్స్‌ చేస్తున్న యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌పై సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశారు. నటీనటులను.. మరీ ముఖ్యంగా హీరో మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read : ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..!

'మా' గౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రహాసన్‌ తరచూ వీడియోలు క్రియేట్‌ చేస్తున్నాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో లింక్స్‌ను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్‌ చంద్రహాసన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు అతనికి నోటీసులు పంపించారు.

#actor-siva-balaji
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe